లైకులు, కామెంట్ల కోసం కొందరు ఎన్ని విన్యాసాలు అయినా చేస్తారు. అలాంటి విన్యాసాల వీడియోలు సోషల్ మీడియాలో బోలెడు దొరుకుతాయి. కొందరు స్టంట్స్ చేయబోయి అడ్డంగా బుక్కయిపోవడం కూడా చూశాం. కొందరు స్టంట్స్‌ను అదరగొట్టేస్తారు. మరికొందరు ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. యువకులు రీల్స్ చేస్తూ వాటికి లైక్స్, వ్యూస్ (Views) రావాలని ప్రాణాల మీదికి తెచ్చుకుంటున్నారు. తాజాగా, ఇలాంటి సంఘటనే రాజస్థాన్(Rajasthan)లోని ఉదయ్ పూర్లో జరిగింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇటీవల కాలంలో చాలా మంది సోషల్ మీడియాను విచ్చల విడిగా వాడుతున్నారు.
అందులో కొంత మంది యువకులు రీల్స్ కోసంమోర్వానియా(Morvania)లో వంతెన వద్దకు వెళ్లి ప్రవాహంలో చిక్కుకున్నారు. దీంతో వారిని గమనించిన వారు అధికారులకు సమాచారం అందించారు. వారు క్రేన్ సహాయంతో వారిని కాపాడారు.అయితే ప్రస్తుతం చాలా చోట్ల భారీ వర్షాలు (Heavy rains) కురుస్తున్న విషయం తెలిసిందే. దీంతో అధికారులు అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు రాకూడదని హెచ్చరిస్తున్నారు. ఇలాంటి సమయంలో నిస్సహాయస్థితిలో ఉన్నవారికి సహాయం చేయాల్సింది పోయి రీల్స్ (Reels) కోసం ప్రమాదాన్ని కొని తెచ్చుకుంటున్నారు.