»Virat Kohli Fan Traveling From California To Watch King Bat In Hyderabad Shows Ipl Craze Is Real
Virat kohli: కోసం ఓ అభిమాని ఏం చేశాడో తెలుసా?
స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(Virat Kohli ) అభిమాని ఏకంగా దేశాలు దాటి హైదరాబాద్(California to Hyderabad) వచ్చేశాడు. ఈ సంఘటన ఇటీవల వెలుగులోకి వచ్చింది. కాలిఫోర్నియాలోని ఓర్లాండోకు చెందిన ఓ అభిమాని హైదరాబాద్లోని ఉప్పల్ ఐపీఎల్ మ్యాచ్ కోసం గురువారం వచ్చాడు. ఆ క్రమంలో తన ఆరాధ్యదైవమైన విరాట్ కోహ్లీని చూసేందుకు 8,985 మైళ్ల ప్రయాణాన్ని పూర్తి చేశాడు.
టీమిండియా మాజీ కెప్టెన్, ఆర్సీబీ ప్లేయర్ విరాట్ కోహ్లీ(Virat Kohli)కి ఉన్న క్రేజ్ గురించి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయనకు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. ఇక అభిమానులు ఆయనపై ఉన్న ఏదో ఒక రూపంలో చూపించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. కొందరు ఆయనను దగ్గర నుంచి చూడాలని అనుకుంటారు. మరికొంత మంది పోడియంలో నుంచి మైదానంలోకి పరుగులు తీస్తూ ఉంటారు. ఇలా ఎవరికి తోచినట్లు వారు చేస్తూ ఉంటారు. తాజాగా ఓ వ్యక్తి చూపించిన అభిమానానికి మాత్రం అందరూ ఫిదా అయిపోతున్నారు.
అభిమాని కోహ్లీ కోసం రికార్డు స్థాయిలో 8,985 మైళ్ల దూరం ప్రయాణం చేసి హైదరాబాద్(California to Hyderabad) చేరుకున్నాడు. ఇంతకీ మ్యాటరేంటంటే.. ప్రస్తుతం ఐపీఎల్ మ్యాచ్ లో భాగంగా గురువాం సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడ్డాయి. ఈ మ్యాచ్ ని వీక్షించడానికి వచ్చిన ఓ వ్యక్తి చేతిలోని ప్లకార్డ్ కెమెరా కంటికి చిక్కింది.
ఏంటా అని చూస్తే.. ‘ఒర్లాండో టు హైదరాబాద్. (Kohli) ఆటను చూసేందుకు 8,985 మైళ్ల దూరం ప్రయాణించి హైదరాబాద్కు వచ్చానంటూ’ ప్లకార్డుపై రాసుకొచ్చాడు. కాగా, అతని అభిమానాన్ని చూసి అందరూ వావ్ అని మెచ్చుకుంటున్నారు. ఆయన అంత దూరం నుంచి వచ్చినా ఎలాంటి నిరాశ చెందలేదు. ఆ మ్యాచ్ లో కోహ్లీ అదరగొట్టాడు. అంతేకాదు ఆ మ్యాచ్ కూడా ఆర్సీబీ గెలవడం విశేషం.