Jr.NTR : ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వేదిక పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇద్దరు ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడిచి అందరినీ ఆకట్టుకున్నారు.
ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు పాట.. బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో ఆస్కార్ అవార్డ్ అందుకొని చరిత్ర సృష్టించింది. ఆస్కార్ వేదిక పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. ఇద్దరు ఆస్కార్ రెడ్ కార్పెట్ మీద నడిచి అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ వేడుక కోసం పులి బొమ్మతో ప్రత్యేకంగా డిజైన్ చేసిన ఒక సూట్ ధరించాడు ఎన్టీఆర్. అదే అక్కడున్న వారిని తెగ అట్రాక్ట్ చేసేసింది. ఆ పులి బొమ్మ కరెక్ట్‌గా ఎన్టీఆర్ భుజం మీదకు వచ్చి డ్రెస్ మొత్తాన్ని హైలైట్ అయ్యేలా చేసింది. అందుకే ఓ హాలీవుడ్ రిపోర్టర్.. పులి బొమ్మ ఎందుకు వేసుకొచ్చారని తారక్‌ని అడిగారు. దానికి ఎన్టీఆర్ ఆసక్తికరమైన ఆన్సర్ ఇచ్చారు. ‘మీరు ఆర్ఆర్ఆర్ సినిమాలో పులిని చూశారు కదా.. తనతో కలిసి దూకిన పులి ఇదే’.. అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు ఎన్టీఆర్. అలాగే గౌరవ్ గుప్తా అనే డిజైనర్ తన డ్రెస్ డిజైన్ చేసినట్లు తెలిపారు. పులి ఇండియన్ జాతీయ జంతువు, దాని బొమ్మను ధరించి రెడ్ కార్పెట్ మీద నడవడం, నాకెంతో గర్వంగా ఉంటుందని.. చెప్పుకొచ్చాడు. దానికి యాంకర్.. మిమ్మల్ని చూస్తే దేశం మొత్తం గర్వపడుతోందని కామెంట్ చేసింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక రామ్ చరణ్ కూడా బ్లాక్ డ్రెస్‌లో కనిపించి స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచాడు. రాజమౌళి ధోతీతో కూడిన కుర్తాను ధరించారు. ఇక ఈ ఆస్కార్ అవార్డు రావడంపై.. ఆర్ఆర్ఆర్ సంతోషంలో మునిగి తేలుతోంది. తమకు మాటలు రావడం లేదని.. ఈ జీవితానికి ఇది చాలు అన్నట్టుగా ఎమోషనల్ అవుతున్నారు. మొత్తంగా జక్కన్న మాత్రం అనుకున్నది సాధించేశాడు.