కాలిఫోర్నియా(California)లో షాకింగ్ సంఘటన చోటుచేసుకుంది. బిడ్డ ఏడిస్తే పాలివ్వడం అందరూ తల్లులు చేసే పని. కానీ ఈ తల్లి మరోసారి బిడ్డ ఏడవకూడదు అనుకుందేమో! ఏకంగా మందు పట్టింది. దీనికి సంబంధించి లాస్ ఏంజిల్స్(Los Angeles)టైమ్స్ నివేదిక ప్రకారం, హోనెస్టి డి లా టోర్రే, రియాల్టోలోని ఓ ఆస్పత్రికి తన బిడ్డను తీసుకువెళ్లింది. ఆ సమయంలో చిన్నారి “మత్తులో” ఉన్నట్లు గుర్తించారు. దీంతో వెంటను తల్లిని అరెస్టు చేశారు. శాన్ బెర్నార్డినో (San Bernardino) కౌంటీ షెరీఫ్ డిపార్ట్మెంట్ మాట్లాడుతూ, మహిళ రియాల్టో నుండి డ్రైవింగ్ చేస్తూ వెడుతోంది. ఆ సమయంలో పాప ఏడుపును ఆపడానికి ప్రయత్నించింది.
దీనికోసం పాపకు పట్టే బాల బాటిల్ లో మద్యం ఇచ్చిందని తెలిపారు.37 ఏళ్ల మహిళకు ఈ నేరం కింద 60,000 డాలర్ల బాండ్‌పై వెస్ట్ వ్యాలీ డిటెన్షన్ సెంటర్లో ఉంచారు. ఆమె కోర్టుకు హాజరు కావచ్చని న్యూయార్క్ టైమ్స్ (New York Times) నివేదించింది. ఈ ఘటన తీవ్ర ఆగ్రహావేశాలను రేకెత్తించింది.మరో దిగ్భ్రాంతికరమైన సంఘటనలో, ఓహియోలో ఓ తల్లి తన 16 నెలల పసిబిడ్డను హతమార్చింది. పదిరోజులు ఆమె సెలవులకు వెడుతూ.. చిన్నారిని అలాగే వదిలేసింది. ప్యూర్టో రికో, డెట్రాయిట్ పర్యటనకు వెడుతూ.. శిశువు ఇంటి లోపల ఒంటరిగా వదిలేసి వెళ్లింది. దీంతో చూసుకునేవారు లేక చిన్నారి మృతి చెందింది. క్రిస్టెల్ కాండెలారియో (Kristel Candelario) (31) యేళ్ల ఆ మహిళను పోలీసులు అరెస్టు చేశారు. పాప ఏడుపు ఆపాలనే ఉద్దేశ్యంతో తల్లి పాల సీసాలో మద్యం నింపిందని తెలుసుకొని అధికారులు ఆశ్చర్యపోయారు. చిన్నారి జీవితానికి ముప్పు కలిగించిందన్న దానిపై పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.