»Mother Got Married For The Second Time In Tamil Nadu
Selvi: తల్లికి మళ్లీ పెళ్లి చేసి రుణం తీర్చుకున్న కొడుకులు
ఇద్దరు కొడుకులు తమ తల్లికి రెండో పెళ్లి చేసిన ఘటన తమిళనాడు(Tamilnadu) రాష్ట్రంలోని కల్లకురిచి జిల్లాలో చోటుచేసుకుంది. వలయమ్పట్టు గ్రామానికి చెందిన సెల్వి(Selvi) అనే మహిళలకు ఇద్దరు కొడుకులున్నారు.పెద్ద కొడుకు భాస్కర్, చిన్న కొడుకు వివేక్ లు చిన్నతనంలోనే తమ తండ్రిని కోల్పోయారు. 2009లో వారి తండ్రి చనిపోయాడు. భాస్కర్ డిగ్రీ చదువుతుండగా తన టీచర్ మీ అమ్మకు రెండో పెళ్లి(Second Marriage) ఎందుకు చేయకూడదని ప్రశ్నించడంతో భాస్కర్ చాలా బాధపడ్డాడు.

ఉద్యోగంలో చేరిన తర్వాత భాస్కర్ పుస్తకాలు(Books) బాగా చదివేవాడు. పెరియార్(Periyar) రాసిన పుస్తకాలు(Books) ఎక్కువగా చదవడం వల్ల అందులో ఉండే వితంతు పునర్వివాహాల గురించి చదివి స్ఫూర్తి పొందాడు. ఇంట్లో తన తల్లి భర్తను కోల్పోయి ఒంటరిగా ఉంటోందని, తల్లికి మళ్లీ ఎందుకు పెళ్లి చేయకూడదనే విషయంలో బాగా ఆలోచించాడు. తమ్ముడు వివేక్ తో చర్చించి ఇద్దరూ తమ నిర్ణయాన్ని తల్లికి చెప్పారు.
సెల్వి(selvi) కొడుకుల ఆలోచనకు ఆశ్చర్యపోయింది. మొదట ఇద్దరు కొడుకులను తిట్టిపోసినా ఆ తర్వాత కొడుకు రోజూ బుజ్జగించి బ్రతిమాలడంతో పిల్లల కోసం ఒప్పుకుంది. ఇతరులు తన గురించి ఏం అనుకుంటే ఏమని, తన పిల్లలు సంతోషంగా ఉండటమే కావాలని అనుకుంది. చివరి రోజుల్లో పిల్లలపై ఆధారపడకుండా తనకంటూ ఓ తోడు ఉండాలనుకుంది. భర్త చనిపోయాక తనకు ఎదురైన అవమానాలను, సూటిపోటిమాటలను గుర్తు చేసుకుంది. తాను ఎందరికో ఆదర్శం కావాలని నిర్ణయించుకుని పెళ్లి(Marriage)కి ఒప్పుకుంది. యేలుమలై అనే రైతుతో సెల్వి పెళ్లి జరిగింది. పెళ్లికి బంధువులు ఎవ్వరూ రాకపోయినా ఇద్దరు కొడుకు అమ్మకు మరో పెళ్లి చేసి రుణం తీర్చుకున్నారు.