Ram Charan : ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అమెరికాలో ఉన్నాడు . మార్చి 12న జరగనున్న ఆస్కార్ వేడుకల కోసం అక్కడికి వెళ్లాడు చరణ్. ఈసారి నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వరిస్తుందనే గట్టి నమ్మంతో ఉంది ట్రిపుల్ ఆర్ టీమ్. అందుకే ఎన్టీఆర్ కూడా త్వరలో అమెరికా వెళ్లనున్నాడు.
ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ అమెరికాలో ఉన్నాడు . మార్చి 12న జరగనున్న ఆస్కార్ వేడుకల కోసం అక్కడికి వెళ్లాడు చరణ్. ఈసారి నాటు నాటు సాంగ్‌కు ఆస్కార్ వరిస్తుందనే గట్టి నమ్మంతో ఉంది ట్రిపుల్ ఆర్ టీమ్. అందుకే ఎన్టీఆర్ కూడా త్వరలో అమెరికా వెళ్లనున్నాడు. అయితే ఈలోపు హాలీవుడ్లో హాట్ టాపిక్ అవుతున్నాడు రామ్ చరణ్. అక్కడ పలు ఈవెంట్స్‌కు అటెండ్ అవుతూ, ఇంటర్వ్యూలు ఇస్తూ.. అవార్డ్స్ అందుకుంటూ ట్రెండిగ్‌లో ఉంటున్నాడు. హాలీవుడ్ క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డ్స్‌లో ప్రజెంటర్‌గా వ్యవహరించాడు. అలాగే అమెరికన్ పాపులర్ షో ‘గుడ్ మార్నింగ్ అమెరికా’లో సందడి చేశాడు. ఈ నేపథ్యంలో చరణ్ ట్రెండీ లుక్స్ వైరల్ అవుతునే ఉన్నాయి. స్టైలిష్ సూట్స్‌లో సూపర్ స్టైలిష్‌గా కనినిస్తున్నాడు చరణ్. దీంతో ఫ్యాన్స్ దృష్టి చరణ్ సూట్స్ పై పడింది. ఇంకేముంది.. వెంటనే సోషల్ మీడియాలో ఆరా తీయడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో చరణ్ ధరించిన సూట్ రేట్లు చూసి షాక్ అవుతున్నారు. చెన్నైలోని ఓ ప్రముఖ డిజైనర్ దగ్గర చరణ్ కోసమే ప్రత్యేకంగా ఆ షూట్స్ తయారు చేయించారట. ఒక్కో సూటు కోసం సుమారుగా 13 నుంచి 70 లక్షల వరకు ఖర్చు చేసినట్లు సోషల్ మీడియాలో జోరుగా సమాచారం. దీంతో సూట్‌కే లక్షలేంటీ సామి.. అంటూ ఆశ్చర్యపోతున్నారు నెటిజన్స్. అయితే అక్కడుంది మెగా పవర్ స్టార్ కాబట్టి.. ఆ మాత్రం ఉండాల్సిందే అంటున్నారు మెగా ఫ్యాన్స్. అంతే కదా మరి.. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న చరణ్.. ఆ మాత్రం ఉండాల్సిందే. మామూలుగానే చరణ్ మెగా బ్రాండ్ కాబట్టి.. మెయింటనేన్స్ ఓ రేంజ్లో ఉంటుంది. అలాంటిది ఆస్కార్ లెవల్లో అంటే.. అలానే ఉంటది మరి!