»Im Back Trump Writes 1st Facebook Youtube Posts After Ban Lifted
Ex President Of America : మళ్లీ ఫేస్ బుక్ లోకి అడుగుపెట్టిన డోనాల్డ్ ట్రంప్..!
Ex president Of America : అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు రెండేళ్ల తరువాత ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఫేస్బుక్లో వైరల్ గా మారింది. 2021 జనవరిలో అమెరికా చట్టసభల వేదిక ‘క్యాపిటల్’పై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగిన సందర్భంలో ఫేస్బుక్ ఆయన అకౌంట్‌పై నిషేధం విధించింది.
అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ దాదాపు రెండేళ్ల తరువాత ఫేస్‌బుక్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. ‘‘నేను మళ్లీ వచ్చేశా’’ అంటూ ట్రంప్ కామెంట్ చేస్తున్న వీడియో ప్రస్తుతం ఫేస్బుక్లో వైరల్ గా మారింది. 2021 జనవరిలో అమెరికా చట్టసభల వేదిక ‘క్యాపిటల్’పై ట్రంప్ మద్దతుదారులు దాడికి దిగిన సందర్భంలో ఫేస్బుక్ ఆయన అకౌంట్‌పై నిషేధం విధించింది. యూట్యూబ్ కూడా ట్రంప్ అధికారిక అకౌంట్‌ను ఫ్రీజ్ చేసింది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు యూట్యూబ్ ట్రంప్ అకౌంట్‌ను బ్లాక్ చేసింది.
ఇక శుక్రవారం ఫేస్బుక్, యూట్యూబ్‌లు ట్రంప్ అధికారిక అకౌంట్లను పునరుద్ధరించాయి. ఈ క్రమంలోనే ట్రంప్ వీడియోలు ఆ రెండు వేడుకల్లోనూ దర్శనమిచ్చాయి. ‘‘మిమ్మల్ని ఇంతకాలం వెయిట్ చేయించినందుకు సారీ’’ అని ట్రంప్ ఆ వీడియోలో వ్యాఖ్యానించారు. ఇక వీడియో చివర్లో.. ‘ట్రంప్ 2024’ అన్న టైటిల్ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 2016 నాటి ఎన్నికల్లో హిల్లరీ క్లింటన్‌పై గెలిచి అమెరికా అధ్యక్షుడైన ట్రంప్.. ఆ తరువాతి ఎన్నికల్లో జో బైడెన్ చేతిలో ఓటమి చెందారు. ఇక 2024లో జరిగే ఎన్నికల్లో బైడెన్‌ను మట్టి కరిపించి తన ఆధిపత్యం చాటుకోవాలని డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.