»Trisha Trishas Re Entry Fix Romance With Star Hero
Trisha: త్రిష రీ ఎంట్రీ ఫిక్స్.. స్టార్ హీరోతో రొమాన్స్!
చెన్నై చిన్నది త్రిష గురించి అందరికీ తెలిసిందే. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికీ స్టార్ హీరోయిన్ స్టాటస్‌ను అనుభవిస్తోంది. ఈ నేఫథ్యంలో తెలుగులో రీ ఎంట్రీకి రెడీ అయింది. అందుకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది.
Trisha: సినీ కెరీర్ ప్రారంభించి రెండు దశాబ్దాలు దాటినా కూడా ఇప్పటికీ క్రేజీ ప్రాజెక్ట్స్‌తో స్టార్ హీరోయిన్గా సత్తా చాటుతోంది చెన్నై బ్యూటీ త్రిష. ఈ జనరేషన్ యంగ్ హీరోయిన్లకు ధీటుగా దూసుకుపోతోంది. పొన్నియలన్ సెల్వన్‌తో సాలిడ్ బౌన్స్ బ్యాక్ అయిన త్రిష.. చివరగా విజయ్ లియో సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం తమిళ్, మళయాళంలో కొన్ని భారీ ప్రాజెక్ట్స్ చేస్తోంది. ఇక ఇప్పుడు తెలుగులో రీ ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అయింది. గత కొన్ని రోజులుగా త్రిష టాలీవుడ్ రీ ఎంట్రీ అనే వార్తలను నిజం చేస్తూ.. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాతో జోడి కట్టింది.
దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత టాలీవుడ్లోకి రీఎంట్రీ ఇస్తున్న త్రిష.. చివరగా 2016లో నాయకి అనే సినిమా చేసింది త్రిష. ఆ తర్వాత టాలీవుడ్‌కు దూరమై కోలీవుడ్‌కే పరిమితమైంది. ఇప్పుడు చిరుతో రొమాన్స్ చేయడానికి రెడీ అయింది. గతంలో 2006లో చిరంజీవి సరసన స్టాలిన్ సినిమాలో హీరోయిన్గా నటించింది త్రిష. ఇప్పుడు దాదాపు పద్దెనిమిదేళ్ల తర్వాత విశ్వంభరలో మళ్లీ చిరంజీవి, త్రిష జంటగా నటిస్తుండడం ఆసక్తికరంగా మారింది.