మనం సోషల్ మీడియాలో తరుచూ ఫన్నీ, వైరల్ వీడియోలను చూస్తూనే ఉంటాం. ఇటీవలి ఓ వధువు డ్యాన్స్ చేస్తుండగా, పక్కనే ఉన్న వరుడు చిరునవ్వులు నవ్వుతున్న వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియో గత నెలలో అప్ లోడ్ అయింది. అయితే ఇప్పటికీ వైరల్ అవుతోంది. ఈ వీడియోను ఇప్పటి వరకు అరవై లక్షల మందికి పైగా చూడగా, ఒక లక్షా ముప్పై ఆరువేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇది షార్ట్ వీడియో. కానీ అందరినీ అలరిస్తోంది. పెళ్లి సమయంలో బంధువులు, స్నేహితులు కలిసేందుకు వధువు, వరుడితో ఒక స్టేజీని ఏర్పాటు చేస్తారు. వీరిద్దరు స్టేజ్ పైన నిలబడి ఉన్నారు. ఈ వీడియోలో…. బ్యాక్ గ్రౌండ్లో ఓ పాట ప్లే చేయడం ప్రారంభమవుతుంది. చిన్న పిల్లలు దానికి అనుగుణంగా మూవ్మెంట్స్ ఇస్తుంటారు. ఆ సమయంలో పెళ్లికూతురు ఏమాత్రం సంకోచం లేకుండా చిన్న పిల్లలతో కలిసి డ్యాన్స్ చేయడం ప్రారంభిస్తుంది. తన డ్యాన్స్‌తో ఆమె అదరగొడుతుంటే వరుడు ఓ వైపు నవ్వును ఆపుకోలేకపోతాడు. కాసేపటికి ఆమె వరుడి చేయి పట్టుకొని తనతో కలిసి డ్యాన్స్ చేయమని అడుగుతుంది. ఆ వధువు పల్కీ కే హోకే అనే పాటకు డ్యాన్స్ చేసింది. వధువు బ్రైట్ రెడ్ లెహెంగాలో ఉండగా, వరుడు వైట్ సూట్-ప్యాంట్ ధరించాడు. నెటిజన్లు కామెంట్లు కూడా పెడుతున్నారు. ఆ దేవుడు వీరిద్దరిని ఎల్లకాలం ఇలాగే సంతోషంగా ఉంచాలని కోరుకుంటున్నట్లు ఓ నెటిజన్ పేర్కొన్నాడు.