»Bihar Cm Nitish Kumar Gets Angry At English Again
CM Nitish Kumar: హిందీని చంపేస్తారా.. ఇంగ్లీష్ వినియోగంపై ఆగ్రహం
ఇంగ్లీష్ వినియోగం (english language) పైన బీహార్ ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు.
ఇంగ్లీష్ వినియోగం (english language) పైన బీహార్ ముఖ్యమంత్రి (Bihar Chief Minister) నితీష్ కుమార్ (Nitish Kumar) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకంగా అసెంబ్లీలోనే ఆయన తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. శాసన మండలిలో (legislative council) ఒక బోర్డు ఇంగ్లీష్ లో ఉండటాన్ని చూసిన ఆయన తీవ్ర కలత చెందారు. పక్కనే ఉన్న మండలి చైర్మన్ దేవేష్ చంద్ర ఠాకూర్ (Chairman Devesh Chandra Thakur) వద్ద తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. హిందీని అంతం చేయాలనుకుంటున్నారా అని వ్యాఖ్యానించారు. ‘మీరేం రాశారు.. అక్కడ హానరబుల్, స్పీకింగ్ టైమ్.. అని ఉంది. దీని అర్థం ఏమిటి.. బీహార్ లో ఇలా రాయడం ఏమిటి.. దానినే ఎందుకు డిస్ ప్లే చేస్తున్నారు.. ప్రతిది హిందీలో ఉండాలి.’ అన్నారు. హానరబుల్, స్పీకింగ్ టైమ్ వంటి పదాలను కూడా ఉపయోగించడంలో అర్థం లేదని, హిందీ భాషను బతకనీయాలంటూ కఠిన స్వరంతో మాట్లాడారు. దీంతో కల్పించుకున్న చైర్మన్… ముఖ్యమంత్రిని శాంతపరిచే ప్రయత్నాలు చేశారు. ఈ సంభాషణ మొత్తం ఒక నిమిషం ఉంది. ఇది సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ముఖ్యమంత్రి నితీష్ కుమార్ (Nitish Kumar) ఎగువ సభకు (Upper House) హాజరయిన సమయంలో… సభ్యులు ప్రశ్నలు వేస్తుండగా… మంత్రులు సమాధానం ఇస్తున్నారు. ఆయా శాఖలకు చెందిన మంత్రులు హిందీ, ఇంగ్లీష్ భాషలలో సమాధానం చెబుతున్నారు. నితీష్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో హిందీని ఉపయోగించడంపై హామీ ఇచ్చారు చైర్ పర్సన్. అంతకుముందు పాట్నాలో గ్రాడ్యుయేట్ అయిన ఓ యువకుడు తాను ఉద్యోగం వదిలి తన గ్రామంలో సాగు చేస్తూ రైతుగా మారిన అంశాన్ని ఇంగ్లీష్ లో మాట్లాడినందుకు నితీష్ కుమార్ అసహనం వ్యక్తం చేశారు. ఆసక్తికర విషయమేమంటే అతను నితీష్ ప్రభుత్వాన్ని ప్రశంసించారు. కానీ అతి ఇంగ్లీష్ వినియోగం ఆగ్రహం తెప్పించింది. ఆర్జేడీ నేతృత్వంలోని మహా గట్ బంధన్ లో చేరిన తర్వాత ముఖ్యమంత్రి తీవ్ర ఒత్తిడిలో కనిపిస్తున్నారని బీజేపీ విమర్శలు గుప్పించింది.