»23 Year Old Girl With 1000 Boyfriends Has Created Ai Clone To Date
1000Boy Friends: వామ్మో.. ఏంది పిల్లా.. నీకు 1000మంది బాయ్ ఫ్రెండ్సా ?
ఈ ప్రపంచంలో చాలా వింతలు జరుగుతాయి. చాలా సార్లు మనం వాటి గురించి విన్నప్పుడు నిజంగా నమ్మలేము. అలాంటిదే జార్జియాలోని ఓ యువతికి ఒకరు-ఇద్దరు కాదు వేల సంఖ్యలో బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది చదివి మీరు ఆశ్చర్యపోతున్నారా? మీరు ఏమీ తప్పుగా చదవలేదు, ఇది నిజం.
1000Boy Friends: ఈ ప్రపంచంలో చాలా వింతలు జరుగుతాయి. చాలా సార్లు మనం వాటి గురించి విన్నప్పుడు నిజంగా నమ్మలేము. అలాంటిదే జార్జియాలోని ఓ యువతికి ఒకరు-ఇద్దరు కాదు వేల సంఖ్యలో బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారు. ఇది చదివి మీరు ఆశ్చర్యపోతున్నారా? మీరు ఏమీ తప్పుగా చదవలేదు, ఇది నిజం. కరిన్ మార్జోరీ జార్జియాకు చెందిన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్. కారిన్ తనకు 1,000 మంది బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని పేర్కొంది. ఆమె తన ప్రేమికులందరికీ సమాన సమయాన్ని ఇస్తుంది. కానీ ఇది ఆమెకు ఎలా సాధ్యమవుతుందో తెలుసుకోవడం మరింత ఆసక్తికరంగా ఉంటుంది. దీని కోసం ఆమె ఒక ప్రత్యేక దారిని ఎంచుకుంది. దాని కారణంగా ఆమె ఇప్పుడు చక్కగా సంపాదిస్తుంది.
జార్జియాలోని కమ్మింగ్స్లో నివసిస్తున్న 23 ఏళ్ల కరీన్కు స్నాప్‌చాట్‌లో 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు. కరీన్కు ఉన్న అభిమానుల్లో చాలా మంది ఆమెకు బాయ్‌ఫ్రెండ్ కావాలని కోరుకుంటారు. కానీ కరీన్ మాత్రం అందరితో డేట్స్ కు వెళ్లదు. ఈ పరిస్థితిలో ఒక మార్గాన్ని కనుగొంది. దాని ద్వారా ఆమెకు భారీ డబ్బు కూడా వస్తుంది. డైలీ స్టార్ యొక్క నివేదిక ప్రకారం, కారిన్ ఇటీవలే తన స్వంత AI వెర్షన్, CarynAIని విడుదల చేసింది. ఇది తన స్నేహితులు కావాలనుకునే అనుచరులకు నిమిషానికి ఒక డాలర్ లేదా రూ. 82.18 వసూలు చేస్తుంది. ఈ ఒక్క ట్రిక్ తో ఈ యువతి ఎంత సంపాదిస్తున్నదో ఇప్పుడు మీరే ఊహించవచ్చు.
కారిన్ ప్రకారం ఆమె బోట్ యొక్క తన స్వంత వెర్షన్‌ను రూపొందించడానికి AI సాఫ్ట్‌వేర్‌లో వేల గంటల సంభాషణలను రికార్డ్ చేసింది. కరీన్ ప్రకారం భవిష్యత్తులో ఆమె తన అభిమానులతో ప్రైవేట్ విషయాలను కూడా పంచుకుంటుంది. AI సాఫ్ట్వేర్ ద్వారా తాను ప్రస్తుతం 1,000 మంది ‘బాయ్‌ఫ్రెండ్స్’తో డేటింగ్ చేస్తున్నట్లు కరీన్ తెలిపింది. ఇందుకోసం వారు ఆమెకు గంటకు ఒక డాలర్ చెల్లిస్తున్నారు. ఆమె 1.8 మిలియన్ల మంది ఫాలోవర్లలో 20,000 మంది CarynAI కోసం సైన్ అప్ చేస్తే.. ఆమె AI బాట్ నెలకు $5 మిలియన్లు (రూ. 41 కోట్లకు పైగా) సంపాదించవచ్చు.