Sengol: కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం జరిగింది. లోక్‌సభలో స్పీకర్ చైర్ వద్ద సెంగోల్‌ను ప్రధాని మోడీ ఏర్పాటు చేశారు. అసలు సెంగోల్ (Sengol) అంటే ఏంటీ..? దాని నేపథ్యం ఏంటీ..? అనే సందేహాలు వస్తున్నాయి. సెంగోల్ అంటే రాజదండం.. అధికార మార్పిడికి పూర్వం రాజులు ఉపయోగించారు. ఇప్పుడు పార్లమెంట్లో ఏర్పాటు చేశారు.
#WATCH | PM Modi receives blessings of seers of different Adheenams from Tamil Nadu after the installation of the 'Sengol' in the new Parliament building in Delhi pic.twitter.com/Hex1LaWA8X
రాజరాజ చోళుడి కాలంలో అధికార మార్పిడికి చిహ్నంగా సింగోల్ (Sengol) ఉపయోగించారట. బ్రిటిషర్ల నుంచి భారతదేశానికి అధికార మార్పిడి జరిగే సమయంలో వినియోగించారు. ఇప్పటివరకు అదీ మ్యూజియంలో ఉండిపోయింది. ఇప్పుడు పార్లమెంట్ భవనంలో ప్రతిష్టించారు. రాజ రాజ చోళుడి కన్నా ముందే నంది చిహ్నంతో కూడిన రాజదండాన్ని అధికార మార్పిడికి ఉపయోగించారట. ఈ విషయాన్ని చరిత్రకారులు చెబుతున్నారు.
కర్ణాటకలో గల పట్టదకల్ ఆలయ సమీపంలో విరూపక్ష దేవాలయంపై నటరాజస్వామి శిల్పంలో నంది ధ్వజం రూపంలో రాజదండం చెక్కి ఉందని పురావస్తు పరిశోధకులు సీహెచ్ బాబ్జీరావు, ఈమని శివనాగిరెడ్డి తెలిపారు. ఈ ఆలయాన్ని బాదామీ చాళుక్య చక్రవర్తి రెండో విక్రమాదిత్యుడు భార్య లోకమహాదేవి నిర్మించారు. రెండో విక్రమాదిత్యుడు పల్లవ నరసింహవ్రమను ఓడించి.. పాలనను ఆధీనంలోకి తీసుకున్న సందర్భంగా అధికార మార్పిడికి గుర్తుగా రాణి ఆలయాన్ని నిర్మించారు. నటరాజస్వామి పక్కనే సెంగోల్ (Sengol) ప్రతిమ ఏర్పాటు చేశారు. శివుని ఆలయాలకు నందీశ్వరుడు అధికారం వహిస్తాడని ఆగమశాస్త్రాల్లో ఉంది. మూలమూర్తిని దర్శించేముందు నంది అనుమతి పొందాలని అంటారు. అధికారానికి గుర్తుగా నంది రూపాన్ని వాడేవారు. అధికార మార్పిడికి చిహ్నం అయిన సెంగోల్‌పై (Sengol) నంది రూపాన్ని రూపొందించారు. చోళుల కన్నా ముందే ఈ సంప్రదాయం ఉందని చరిత్రకారులు చెబుతున్నారు.
1947లో బ్రిటిషర్ల నుంచి అప్పటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ సెంగోల్ (Sengol) స్వీకరించారు. దీంతో అధికార మార్పిడి పూర్తి అయ్యిందని అంటుంటారు. ఆ తర్వాత సెంగోల్‌కు (Sengol) అంతగా ప్రయారిటీ ఇవ్వలేరు. మ్యూజియంలోనే పెట్టారు. ఇప్పుడు దానికి ప్రధాని మోడీ సముచిత గౌరవం కలిగించారు.
#WATCH | PM Modi installs the historic 'Sengol' near the Lok Sabha Speaker's chair in the new Parliament building pic.twitter.com/Tx8aOEMpYv