New Parliament: కొత్త పార్లమెంట్ భవనంలో (New Parliament) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) పూజలు చేశారు. హవన, పూజలో మోడీతోపాటు (Modi) స్పీకర్ ఓం బిర్లా కూడా పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 7.15 గంటల నుంచి ప్రారంభ కార్యక్రమం స్టార్ట్ అయ్యింది. మోడీ (Modi), ఓం బిర్లా జ్యోతి ప్రజ్వలన చేశారు. ఉదయం 8.45 గంటలకు పార్లమెంట్ భవనాన్ని మోడీ ప్రారంభిస్తారు.
#WATCH | PM Modi installs the historic 'Sengol' near the Lok Sabha Speaker's chair in the new Parliament building pic.twitter.com/Tx8aOEMpYv
ఉదయం 7.15 గంటలకు ప్రధాని మోడీ (PM Modi) పార్లమెంట్ మెయిన్ గేట్ నుంచి వచ్చారు. 7.30 నుంచి గంటపాటు పూజా కార్యక్రమాలు చేస్తారు. ఆ తర్వాత లోక్ సభలోకి ప్రవేశిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు పార్లమెంట్ భవన ప్రారంభ వేడుక జరుగుతుంది. 12.10 గంటలకు రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ స్వాగత ఉపన్యాసం చేస్తారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతుల ప్రసంగాలను చదువుతారు. 12.43 గంటలకు లోక్ సభ స్పీకర్ ప్రసంగిస్తారు. 1.05 గంటలకు ప్రధాని చేతులమీదుగా ప్రత్యేక నాణెం, తపాలా బిళ్ల ఆవిష్కరణ జరుగుతుంది. 1.10 గంటలకు ప్రధాని మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడతారు.
#WATCH | PM Modi bows as a mark of respect before the 'Sengol' during the ceremony to mark the beginning of the inauguration of the new Parliament building pic.twitter.com/7DDCvx22Km
పార్లమెంట్ ప్రారంభోత్సవ వేడుకకు హోం మంత్రి అమిత్ షా (amith shah), బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా (jp nadda), బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు యోగి ఆదిత్యనాథ్, హేమంత్ విశ్వశర్మ, పుష్కర్ సింగ్ ధామి వచ్చారు. సెంగోల్‌ను ప్రధాని మోడీకి అందజేశారు. దానిని లోక్‌సభలో స్పీకర్ ఛైర్ వద్ద ఏర్పాటు చేశారు. 18 మఠాధిపతులు ప్రధాని మోడీని ఆశీర్వదించారు.