Warangal Rains: తెలంగాణ రాష్ట్రంలో కుంభవృష్టి వర్షంతో జనజీవనం స్తంభించిపోయింది. ఓరుగల్లుపై (Warangal) వరుణుడు పగబట్టినట్టు అనిపించింది. గత రెండు, మూడు రోజుల నుంచి కురిసిన వర్షం (rain), వర్షపునీటితో వరంగల్, హన్మకొండ ప్రజల ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. అంతా ఇళ్ల పైకి చేరుకుని.. తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని కోరారు. ఓ హాస్టల్ పైకి 200 మంది విద్యార్థినిలు చేరుకోగా.. వారిని నిన్ననే బోట్లలో తరలించారు.
సహాయక చర్యల్లో ఎస్డీఆర్ఎఫ్ (sdrf), ఫైర్ సిబ్బంది (fire) పాల్గొన్నారు. జనాలను తరలించడంలో నిమగ్నం అయ్యారు. వరంగల్ (warangal) శివారులో చెరువులు నిండి వరదనీరు పారింది. వరంగల్ సిటీలో ఇప్పటికీ 82 కాలనీలు (82 colonies) వరదల్లో ఉన్నారు. హన్మకొండలో జవహర్ నగర్, ఊచమ్మ కుంట, భవానీ నగర్, సమ్మయ్య నగర్, రాంనగర్ కాలనీ, వరంగల్ హంటర్ రోడ్, సాయి నగర్, ఎస్ఆర్ నగర్, శివనగర్, ఆటో నగర్ ప్రాంతాలు వరద గుప్పిట్లో ఉన్నాయి.
వరదనీటిలో చిక్కుకున్న జనాలను తరలించే వీడియో ఒకటి సోషల్ మీడియాలో షఏర్ చేశారు. అందులో ఐదుగురు వరకు తరలిస్తున్నారు. సిటీలో కూడా హెలికాప్టర్ ద్వారా తరలింపు చేపడితే వెంటనే ప్రక్రియ పూర్తవుతుందని స్థానికులు అంటున్నారు. ఇటు మోరంచపల్లిలో వరదనీరు తగ్గింది. జనం ఇళ్ల వద్దకు చేరుకున్నారు. వరద పోయిన బురద మాత్రం తప్పలేదు. ఇంట్లో అన్నీ వస్తువులకు బురద పేరుకుపోయింది.
వరంగల్ నగరాన్ని వీడని వరద ముప్పు.. బోట్లలో ప్రజలను తరలిస్తున్న రెస్క్యూ సిబ్బంది
నిన్న రికార్డు స్థాయిలో కురిసిన వర్షానికి వరంగల్ నగరం వణికింది. చెరువులు పొంగడంతో వచ్చిన వరదనీటితో నగరం నీటిపై తేలియాడినట్టైంది. ఇంకా పలు కాలనీ జల దిగ్బంధంలోనే ఉండగా దాదాపు 82 కాలనీల వాసులు పూర్తిగా… pic.twitter.com/9ZxKR30vm5
ఆ బురద క్లీన్ చేయడం వారికి సవాల్‌గా మారింది. ఇప్పటికిప్పుడు వారికి మంచినీరు కష్టం.. ఉన్న మోటార్లు కూడా నీటితో తడిచి నడవలేని పరిస్థితి. ఇంటిని చక్కదిద్దుకోవడం ఎలా అని మదన పడుతున్నారు. వరదనీటితో పశువులు చనిపోయిన దృశ్యాలు కనిపించాయి. వాటిని చూసి యాజమానులు రోదించారు. మొరంచపల్లెలో ఎక్కడ చూసినా హృదయ విదారకర దృశ్యాలు కనిపిస్తున్నాయి.