I phone: స్మార్ట్ ఫోన్ జనాలను బానిస చేస్తోంది. దీంతో కొందరు ఎంతకైనా తెగిస్తున్నారు. మొబైల్ కొనేందుకు చోరీలు చేసిన ఘటనలు చూశాం.. ఓ జంట మాత్రం తేగు పెంచుకొని పుట్టిన బిడ్డను విక్రయించింది. ఆ డబ్బుతో ఐ ఫోన్ కొనుగోలు చేసింది. మిగిలిన డబ్బులతో హనీమూన్ వెళ్లి.. తిరిగి వచ్చింది. తర్వాత కథ మొదలైంది. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంకేముంది తమదైన శైలిలో విచారిస్తే అసలు నిజం చెప్పేశారు.
కుమారుడిని అమ్మి
పశ్చిమ బెంగాల్లో గల ఉత్తర 24 పరగణ జిల్లా పానిహితికి చెందిన జయదేవ్ సాథీ దంపతులు. వీరు గాంధీనగర్‌లో ఉంటున్నారు. ఏడేళ్ల కూతురు ఉంది. ఇటీవల ఓ బాబుకు జన్మనిచ్చింది. ఫేమస్ అయిపోవాలని ఆ జంట అనుకుంది. మొబైల్ కొనుక్కోవాలని భావించింది. అందులో ఐ ఫోన్ అయితే బాగుంటుందని ఆలోచించింది. చాలీచాలనీ బతుకులు.. ఐ ఫోన్ అంటే భారీగానే డబ్బులు కావాలిగా.. ఏం చేయాలని ఆలోచించింది. చివరకు తన కుమారుడిని అమ్మాలని నిర్ణయం తీసుకుంది.
దయ, జాలి లేని పేరంట్స్
ఏ మాత్రం జాలి, దయ లేకుండా పసికందును విక్రయించింది. వచ్చిన డబ్బుతో ఐ ఫోన్ కొనుగోలు చేసింది. ఇన్ స్టాలో రీల్స్ చేసింది. మిగిలిన డబ్బులతో జల్సా చేసింది. హనీమూన్ వెళ్లి ఇంటికి తిరిగి వచ్చింది. ఇంటికి వచ్చాక.. ఆ బాబు కనిపించడం లేదు. చుట్టుపక్కల వారికి అనుమానం వచ్చింది. తొలుత ఏదో చెప్పి తప్పించుకున్నారు. గుచ్చి గుచ్చి అడిగేసరికి.. అమ్మేశానని బరితెగింపు సమాధానం ఇచ్చారు. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అదుపులోకి తీసుకున్నారు.
పసికందును రూ.2 లక్షలకు విక్రయించారు. అలా వచ్చిన డబ్బుతో ఐ ఫోన్ కొనడడే కాదు డిగా బీచ్, మందర్మిని బీచ్ ఇతర ప్రాంతాలను చుట్టేశారు. బిడ్డను విక్రయించడమే కాదు ఇంట్లోనే సాథీ గంజాయి విక్రయిస్తుంటని చుట్టుపక్కల వారు చెబుతున్నారు. సాథీ నుంచి పసికందును కొనగోలు చేసిన ప్రియాంక ఘోష్‌ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. జయదేవ్ మామ ఇంటికి పసికందును తీసుకెళ్లారని తెలుసు అని జయదేవ్ తండ్రి కామై చౌదరీ చెబుతున్నారు. తర్వాత అమ్మేశారని తెలిసిందని బాధతో చెబుతున్నారు. ఎందుకు విక్రయించారో మాత్రం తమకు తెలియదని వివరించారు. బాబును అమ్మేసిన తర్వాత దిగా, మందర్మని బీచ్, తారపీఠ్ కాళి ఆలయానికి వెళ్లారని తెలిపారు. అంతేకాదు తన కుమారుడు, కోడలు తనకు శారీరకంగా, మానసికంగా హింస్తున్నారని తెలిపారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
జయదేవ్ నిన్న కూడా మద్యం సేవించాడని.. తన కూతురిని తీసుకెళ్లమని అరిచాడు, ఎక్కడికి తీసుకెళుతున్నారో చెప్పలేదని టీఎంసీ కౌన్సిలర్ తారొక్ గుహ తెలిపారు. ఇంటికి వెళ్లి మందలించానని చెప్పారు. అప్పుడే పసికందు విక్రయించిన విషయం తెలిసిందని వివరించారు. గత రెండు రోజుల నుంచి బాబు కనిపించడం లేదని నిర్ధారించారు. ఐ ఫోన్ కోసం.. ఇన్ స్టలో రీల్స్ చేసేందుకు.. జల్సాగా తిరిగేందుకు, ఆలయాలు సందర్శించేందుకు పేగు తెంచుకొని పుట్టిన బిడ్డ, నవమాసాలు మోసి కన్న పేగును విక్రయించారు జయదేవ్ దంపతులు. మానవత్వానికి మచ్చ తీసుకొచ్చారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.