BRO Full Movie Review: టైమ్ విలువ చెప్పే బ్రో మూవీ
స్టార్ హీరో పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ కలయికలో వచ్చిన బ్రో మూవీ ఈరోజు(జులై 28న) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సముద్రఖని దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఫాంటసీ కామెడీ డ్రామా చిత్రానికి స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ రాశారు. భారీ అంచనాల నేపథ్యంలో వచ్చిన ఈ మూవీ ఎలా ఉంది? అసలు ఈ మూవీ స్టోరీ ఏంటి నేది ఇప్పుడు చుద్దాం.
BRO Full Movie Review: బ్రో సినిమాలో సాయిధరమ్ తేజ, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరో హీరోయిన్లుగా నటించారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కీ రోల్ పోషించారు. సినిమా ఈ రోజు విడుదలై.. ప్రేక్షకుల ఆదరణ పొందుతుంది.
నిర్మాతలు: టీజీ విశ్వప్రసాద్ రచన, దర్శకత్వం:సముద్ర ఖని విడుదల తేదీ:జూలై 28, 2023
కథ:
మార్కండేయులు (సాయి ధరమ్ తేజ్) ప్రతి రోజు పనికి ప్రాధాన్యత ఇస్తు టైం టైం అంటూ గడిపే బిజీ మనిషి. ఇతరుల భావోద్వేగాలు లేదా అభిప్రాయాలు పెద్దగా పట్టించు కోకుండా టైం లేదని భావిస్తాడు. ఈ క్రమంలో మార్క్ ఒక ప్రమాదంలో మరణిస్తాడు. అప్పుడు అతను టైమ్/గాడ్ టైటాన్ (పవన్ కళ్యాణ్)ని చేరుకుంటాడు. అప్పుడు తన ఫ్యామిలీ తన పైనే ఆధారపడిందని కొంత టైం కావాలని టైటాన్ ను వేడుకుంటాడు. అప్పుడు టైటాన్ రెండవ అవకాశంగా మార్క్ కోసం 90 రోజులు సమయం ఇస్తాడు. ఆ నేపథ్యంలో మార్క్ టైంను ఎలా ఉపయోగించుకున్నాడు? హీరోయిన్‌తో బ్రేక్ అప్ ఎందుకు చేస్తాడు? తన తల్లికి అనారోగ్యం వంటి అనేక సమస్యలను ఎలా అధిగమించాడు? అసలు చివరికి ఏమైంది అనేది అసలు స్టోరీ.
ఎలా సాగిందంటే..
బ్రో మూవీలో భావోద్వేగాలు మెండుగా ఉన్నాయి. ప్రీ క్లైమాక్స్ సాంగ్ టు క్లైమాక్స్ వరకు ఎమోషన్ బాగుంది. అయితే అంతకుముందు కూడా అదే మెయింటెన్ చేస్తే బాగుండేది. కుటుంబం కోసం తాను చాలా చేశానని.. తనకు చెప్పకుండా కొన్ని విషయాలు దాచారని సాయి ధరమ్ మథనపడే సీన్లు, ఉద్యోగంలో ప్రమోషన్ రాలేదని ఫీలయ్యే సీన్, ప్రేయసిని దూరం పెట్టాలని అనుకంటే తన వద్దకు వచ్చే సన్నివేశాల్లో డెప్త్ మిస్ అయ్యింది. ఫస్ట్ హాఫ్ స్టార్టింగ్ పోర్షన్ కొంత బోరింగ్‌గా ఉంటుంది. కానీ పవన్ కల్యాణ్ ఎంట్రీతో ఉత్సాహం వస్తుంది. ఫస్టాఫ్‌లో వచ్చే కామెడీ కొందరికీ నచ్చుతుంది. మరికొందరికీ సెకండాఫ్ ఎమోషన్స్ ఇష్టపడతారు. సెకండ్ హాఫ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి కనెక్ట్ అయ్యేలా ఉంది. పవన్ కల్యాణ్ వివిధ గెటప్పులో స్టైలిష్ గా కనిపిస్తారు. కర్మ సిద్దాంతం అనే కాన్సెప్ట్‌తో రూపొందించిన ఈ చిత్రం ఆలోచింపజేస్తుంది. ఎంత సంపాదించినా కూడా చివరికి ఏమి పట్టుకెళ్లలేరు అనే సత్యాన్ని చక్కగా చూపించారు.
ఎవరెలా చేశారంటే..?
పవన్ కల్యాణ్ యాక్టింగ్ మూవీకి హైప్ తీసుకొచ్చింది. ఫ్యాన్స్ ఊహించినట్టుగానే సినిమా ఉంది. మూవీలో పవన్ 20 ఏళ్లు వెనక్కి వెళ్లినట్టు అనిపిస్తోంది. వింటేజ్ సాంగ్స్ వస్తుంటే.. పవన్ నటనలో ఎనర్జీ చూపించారు. మార్క్ పాత్రలో సాయి ఫర్లేదు అనిపించాడు. ప్లీ క్లైమాక్స్ ముందు సాయి తేజ్ ఫ్లాష్ బ్యాక్ సాంగ్ అదిరింది. ఆ సన్నివేశంలో కంటతడి పెట్టిస్తోంది. యాక్సిడెంట్ అయిన తర్వాత సాయి బరువు పెరిగాడు.. ఆ విషయం స్క్రీన్ మీద కనిపిస్తోంది. డ్యాన్స్ కూడా ఏదో చేసేశాడు. ఎమోషనల్ సీన్స్ మాత్రం అదరగొట్టాడు. సాయి తేజకు ప్రియా చెల్లెలిగా చేశారు. కేతిక శర్మ హీరోయిన్గా చేశారు. తల్లి పాత్రను రోహిణి చేశారు. వెన్నెల కిశోర్, సుబ్బరాజు, తనికెళ్ల భరణి, అలీ రెజా పాత్రల పరిధి మేరకు నటించారు. బ్రహ్మానందం గెస్ట్ రోల్ చేశారు. థమన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అదిరింది. సాంగ్స్ ఫర్వాలేదు అనిపించాయి. సుజిత్ వాసుదేవ్ సినిమాటోగ్రఫీ బావుంది. త్రివిక్రమ్ కొన్ని మాటలే ఆకట్టుకున్నాయట. స్క్రీన్ ప్లే కూడా ఆశించిన స్థాయిలో లేదని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, జీ స్టూడియోస్ నిర్మాణ విలువుల బాగున్నాయి. జీవితంలో సమయం విలువ చెబుతోంది. మూవీ ద్వారా మంచి సందేశం ఇచ్చారు.
ప్లస్
+ పవన్ కల్యాణ్ నటన
+ సాయి ధరమ్ తేజ ఫెర్మార్మెన్స్
+ కథ, కథనం
+ బీజీఎం
+డైలాగ్స్, సెకండాఫ్