వందేభారత్ రైలు మరోసారి వార్తల్లోకి వచ్చిది. ఈ సారి యాక్సిడెంట్ జరగలేదు.. ఫుడ్‌లో బొద్దింక వచ్చింది. మరోసారి ఇలాంటి ఘటన జరగకుండా చూసుకుంటామని ఐఆర్సీటీసీ స్పష్టంచేసింది.
Passenger finds cockroach in food on Vande Bharat Express Train
cockroach in Vande Bharat food: వందేభారత్ ట్రైన్స్ (Vande Bharat Express) వరసగా వార్తల్లో నిలుస్తున్నాయి. ఎక్కడో ఓ చోట రైలు యాక్సిడెంట్‌కు గురవుతూనే ఉంది. రైలు వేగంగా వెళ్లడంతో.. ట్రాక్ మీదకు వచ్చే పశువులను చూడని పరిస్థితి. అయితే ఫుడ్ (food) బాగుంటుందని.. ఆర్డర్ చేసుకోవాలని కోరారు. కానీ ఫుడ్‌లో బొద్దింక (cockroach) రావడం తీవ్ర కలకలం రేపింది.
భోపాల్ (bhopal) నుంచి గ్వాలియర్ వెళుతున్న రైలులో ఈ నెల 24వ తేదీన ఘటన జరిగింది. సుబోధ్ పహలాజన్ ప్యాసెంజర్ చపాతీ ఆర్డర్ చేశాడు. తెరచి చూడగా అందులో బొద్దింక కనిపించింది. దానిని ఫోటో (photo) చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. బొద్దింక (cockroach) వచ్చిందని ఐఆర్సీటీసీకి కూడా ఫిర్యాదు చేశాడు. సోషల్ మీడియాలో ట్వీట్ ట్రోల్ అయ్యింది.
రైల్వే శాఖ (railway) వెంటనే స్పందించింది. బొద్దింక (cockroach) వచ్చినందుకు క్షమించాలని ప్రయాణికుడిని కోరింది. మళ్లీ ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. పీఎన్ఆర్ నంబర్, ఇతర వివరాలు నేరుగా మెసేజ్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. ప్రయాణికుల ఆహారం విషయంలో ఇలాంటి ఘటనలను సహించబోమని తేల్చిచెప్పింది.
సదరు ప్రయాణికుడికి (passenger) మరో పార్సిల్ అందజేశామని భోపాల్ డివిజన్ రైల్వే మేనేజర్ వెల్లడించారు. రైలులో ఫుడ్ సప్లై చేసిన కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు.