Union Minister's House Set On Fire By Thousand-Strong Mob In Manipur
Union Minister House: రెండు కులాల మధ్య గొడవతో మణిపూర్ అట్టుడుకుతోంది. ఇంఫాల్‌లో కేంద్రమంత్రి ఆర్కే రంజన్ సింగ్ (RK Ranjan Singh) నివాసంపై గురువారం రాత్రి అల్లరిమూక దాడికి తెగబడిది. వెయ్యి మంది నిరసనకారులు పెట్రోల్ బాంబులు విసిరారని భద్రతా సిబ్బంది తెలిపారు. దాడి జరిగిన సమయంలో కేంద్ర మంత్రి ఇంట్లో లేరని తెలిపారు. ఆ సమయంలో 9 మంది ఎస్కార్ట్ సిబ్బంది, ఐదుగురు సెక్యూరిటీ గార్డ్స్, 8 మంది అడిషనల్ గార్డ్స్ విధుల్లో ఉన్నారు.
ఒక్కసారిగా వచ్చిన నిరసనకారులు
ఒక్కసారిగా భారీగా నిరసనకారులు వచ్చారు. దీంతో వారిని నియంత్రించడం తమ వల్ల కాలేదని ఎస్కార్ట్ కమాండర్ ఎల్ దినేశ్వర్ సింగ్ తెలిపారు. ఇప్పుడే కాదు మే నెలలో కూడా రంజన్ సింగ్ ఇంటిపై దాడికి ప్రయత్నం జరిగింది. ఆ సమయంలో భద్రతా సిబ్బంది నిరసనకారులను చెదరగొట్టారు. రంజన్ సింగ్ (RK Ranjan Singh) విదేశీ వ్యవహారాలు, విద్యాశాఖ సహాయ మంత్రిత్వ శాఖలు చూస్తున్నారు. రిజర్వేషన్ కోసం పట్టుబడుతున్న మెయిటీ, కుకీ వర్గానికి చెందిన ప్రముఖులతో ఆయన చర్చలు జరిపారు.
మోడీకి లేఖ
హింసను ప్రేరేపిస్తోన్న స్థానిక నేతలను గుర్తించి.. చర్యలు తీసుకోవాలని ప్రధాని మోడీకి రంజన్ సింగ్ (RK Ranjan Singh) లేఖ కూడా రాశారు. మరోవైపు ఇంఫాల్ పశ్చిమ జిల్లా లాంఫెల్ ఆ రాష్ట్ర మంత్రి నెమ్చా కిప్జెన్ అధికార నివాసానికి బుధవారం రాత్రి కొందరు నిప్పు పెట్టారు. ఆ సమయంలో కూడా క్వార్టర్లో ఎవరూ లేరట. మంటలు చుట్టుపక్కలకు వ్యాపించకుండా అదుపులోకి తీసుకొచ్చారు. కిప్టెన్ కుకీ వర్గానికి చెందిన నేత కాగా.. మైతీ వర్గానికి చెందిన వారే నిప్పు అంటించి ఉంటారు.
ఎస్టీ హోదా కోసం పట్టు
ఎస్టీ హోదా కల్పించాలని మెజార్టీ మైతీ వర్గం కోరుతోంది. దీనిని కుకీ వర్గం వ్యతిరేకిస్తోంది. ఈ రెండు వర్గాల మధ్య గత కొన్నిరోజుల గొడవ జరుగుతోంది. మైతీలకు మణిపూర్ వ్యాలీకి చెందిన చట్టసభ్యుల నుంచి మద్దతు వస్తోంది. ఇక్కడ 53 శాతం మంది మైతీ వర్గానికి చెందినవారే ఉంటడంతో సపోర్ట్ ఇస్తున్నారు. ఆ వర్గానికి మద్దతు లభించడంతో గిరిజన వర్గానికి చెందిన కుకీలు ఆందోళన చెందుతున్నారు. అలా ఈ రెండు వర్గాల మధ్య ఘర్షణ జరుగుతుండగా.. కర్ఫ్యూ ఆంక్షలు అమలు చేస్తున్నారు. అయినప్పటికీ ఘర్షణ పూరిత వాతావరణం కొనసాగుతోంది.
Central minister – MoS, MEA Rajkumar Ranjan Singh speaks on #Manipur violence as his house in #Imphal was set on fire last night. He says law and order condition is totally failing in the state. https://t.co/DtB491K2To