PM Modi Played Traditional Drum at Karnataka Campaign
PM Modi Played Traditional Drum:కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీల అధినేతలు బిజీగా ఉన్నారు. అగ్ర నేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. కర్ణాటకలో వరసగా 5 రోజులపాటు ప్రధాని మోడీ (PM Modi) ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే. కర్ణాటక చిత్రదుర్గలో (citradurga) ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Modi) మాట్లాడారు. వేదికపై సంప్రదాయ సంగీత వాయిద్యం డప్పు కనిపించింది. దానిని కొట్టి.. అక్కడున్న వారిలో జోష్ నింపారు. వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.
కర్ణాటక అభివృద్ది చెందాలంటే డబుల్ ఇంజిన్ ప్రభుత్వం (double engine) మళ్లీ రావాలని ప్రధాని మోడీ (modi) అన్నారు. దేశంలో కర్ణాటకను నెంబర్ వన్ స్థానంలోకి తీసుకొచ్చేందుకు మేనిఫెస్టోలో రోడ్ మ్యాప్ ఉందన్నారు. మౌలిక వసతుల సదుపాయాల కల్పన కోసం బ్లూ ప్రింట్ ఉందని ప్రశంసించారు. మహిళలు, యువత సాధికారతపై దృష్టిసారించారని పేర్కొన్నారు.
బీజేపీ ప్రభుత్వాలు అభివృద్ధి కోసం తపిస్తాయని మోడీ (modi) తెలిపారు. కాంగ్రెస్ (congress), జేడీఎస్ (jds) మాత్రం తమ కుటుంబాల కోసం పనిచేస్తాయని విమర్శించారు. స్థానిక భాషలో పరీక్ష రాయడానికి బీజేపీ (bjp) ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని పేర్కొన్నారు. ఆర్థిక ప్రగతి, సుస్థిరత కోసం బీజేపీ పనిచేస్తోందని తెలిపారు.
కాంగ్రెస్ నేతలు ప్రజలను ఎప్పుడూ మోసం చేస్తారని.. నెరవేరని హామీలు ఇస్తుంటారని మోడీ (Modi) మండిపడ్డారు. దీంతో ప్రజలు, రాష్ట్రం డెవలప్ కాదని చెప్పారు. అధికారంలోకి రామని కాంగ్రెస్ పార్టీకి కూడా తెలుసు అని.. అందుకే ఇలాంటి హామీలు ఇస్తారని పేర్కొన్నారు. హొస్పెట్ బహిరంగ సభలో కూడా ప్రధాని మోడీ మాట్లాడారు.