»Ahmedabad Spa Owner Assaulted A Young Woman He Grabbed Her Hair Tore Her Clothes Beat Her
Viral News: యువతిపై వ్యక్తి దాడి.. జుట్టు పట్టి.. బట్టలు చించి రోడ్డుపై దారుణం
ఓ యువతిపై వ్యక్తి దాడి చేస్తూ విపరీతంగా కొట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జుట్టు పట్టుకొని లాగి, మహిళ బట్టలు చించిమరీ విపరీతంగా కొట్టాడు. అక్కడున్న వారు ఎవరూ అడ్డుకోకపోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. సదరు యువతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
Ahmedabad spa owner assaulted a young woman He grabbed her hair tore her clothes beat her
Viral News: అహ్మదాబాద్(Ahmedabad) ప్రాంతంలోని ఓ సెలూన్ సమీపంలో ఒక వ్యక్తి మహిళపై దాడి చేస్తూ దారుణంగా కొట్టిన వీడియో సోషల్ మీడియా(Social Media)లో వైరల్ అవుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుడి కోసం గాలిస్తున్నారు. వీడియోలో మహిళ వెనకాల వచ్చిన మొహ్సిన్ ముందుగా తనను కొడతాడు. తరువాత ఆ మహిళ చేతులతో నెడుతుంది. వెంటనే ఆ మహిళను రెండు సార్లు తలమీద కొడతాడు. మరో వ్యక్తి ఆపడానికి ప్రయత్నిస్తాడు. అయినా సరే మొహ్సిన్ కోపంతో ఆ యువతిపై దాడి చేస్తాడు. జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తాడు. తన డ్రెస్‌ను చింపుతాడు. అయినా సరే ఆ మహిళా తన నుంచి విడిపించుకోవడానికి ప్రయత్నిస్తుంది. దాదాపు నాలుగు నిమిషాల పాటు ఈ తతంగం జరుగుతున్నా అక్కడున్న వారెవ్వరూ అడ్డుకోవడానికి ప్రయత్నించరు. అసలు విషయంలోకి వెళితే..
తనను కొట్టిన వ్యక్తి మొహ్సిన్ ఇద్దరు వ్యాపార భాగస్వాములమని, అహ్మదాబాద్‌లోని కాస్ట్లీ ఏరియాలో సింధుభవన్ పరిసరాల్లో మహిళల కోసం ప్రత్యేక సెలూన్‌ను నడుపుతున్నట్లు మహిళా పోలీసులకు తెలిపింది. ఈ ఘటన సోమవారం జరిగిందని పేర్కొంది. ఈ వివాదం జరిగిన రోజు కాకుండా తరువాతి రోజు పోలీసులను ఆశ్రయించి అసలు విషయం తెలిపింది. ఇద్దరు నడుపుతున్న సెలూన్లో రూ. 5 వేల నష్టం రావడంతో సెలూన్లో పనిచేస్తున్న ఓ యువతిని మందలించిందని, ఆ విషయంలో సదరు యువతిని వెనుకేసుకు రావడంతో ఈ వివాదం ముదిరిందని చెప్పుకొచ్చింది. కూర్చొని మాట్లాడుకుందాం అని చెబుతున్నా వినకుండా ఇష్టం వచ్చినట్లు కొట్టినట్లు పోలీసు ఫిర్యాదులో పేర్కొంది.
On complaint given by victim, Bodakdev police have booked #Mohsin under IPC sections 354A, 294(b), 323. The incident happened on 25 September. Police started suo motu action and convinced victim woman to file FIR after counseling. #Spa#Ahmedabad#Gujaratpic.twitter.com/uHMgjyixwT