»A Bear That Scared The Mother And Sons Mexico Park Picnic
Bear: తల్లి, కొడుకులను భయపెట్టిన ఎలుగుబంటి!
ఒక పార్కుకు తన కుమారిడి పుట్టినరోజు వేడుకలు జరుపుకునేందుకు వెళ్లిన ఓ తల్లికి వింత అనుభవం ఎదురైంది. ఆ పార్కులో తన కుమారుడి కోసం ఏర్పాటు చేసిన ఆహారాన్ని గమనించిన ఓ ఎలుగుబంటి అక్కడకు వచ్చి మొత్తం ఫుడ్ తినేసింది.
a bear that scared the mother and sons mexico park picnic
అడవి జంతువులు జూలో ఉన్నప్పుడు మనమందరం క్యూలు కట్టి మరీ వెళ్లి చూసేస్తాం. కానీ అవి ఒక్కసారి ఫ్రీగా తిరగడం మొదలుపెడితే ఎవరమైనా భయంతో పరుగులు తీయాల్సందే. ఆ క్రమంలోనే ఓ తల్లి తన 15 ఏళ్ల కుమారుడి పుట్టినరోజు వేడుకను పార్కులో చేసుకోవాలని పిక్నిక్ వెళ్లారు. అదే సమయంలో అక్కడకు ఓ ఎలుగుబంటి(bear) వచ్చి నానా హంగామా సృష్టించింది. ఆమె తన కుమారుడి కోసం తెచ్చుకున్న భోజనం మొత్తం తినేసింది. ఒకానొక సమయంలో తన బాబును దగ్గరగా పట్టుకుని అక్కడే కదలకుండా కూర్చున్న ఒక మహిళకు దగ్గరగా వెళ్లింది ఎలుగుబంటి. అయితే ఆమెను ఏమీ అనలేదు. ఆహారం(food) తిన్న తర్వాత ఎవరికీ హాని చేయకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దీనికి పది మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఎలుగుబంటి ఎదురైనప్పుడు ఏం చేయాలో పార్క్ వెబ్సైట్లో కొన్ని సూచనలు చేశారు. ముఖ్యంగా ఫోటో తీసుకోవడానికి దగ్గర వెళ్లకూడదని కూడా దానిలో హెచ్చరించారు. ఈ సంఘటన మెక్సికో లోని చిపింక్యూలోని ఎకోలాజికల్ పార్కులో చోటుచేసుకుంది.