ప్రతిభ ఉంటే చాలు ప్రపంచాన్నే తమ వైపు తిరిగి చూసేలా చేసుకోవచ్చని చాలా మంది యువకులు నిరుపిస్తున్నారు. టాలెంట్‌తో రోల్స్ రాయిస్ కంపెనీనే ఆశ్చర్యానికి గురిచేశాడు. కేరళ యువకుడు. అతి తక్కువ ధరకే అలాంటి కారు మోడల్ తయారు చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
A Kerala youth made a Rolls Royce car for just 45 thousand rupees
Viral News: టాలెంట్(Talent) ఏ ఒక్కరిదో కాదని, ప్రతిభ ఉంటే ప్రపంచాన్నే ఆశ్చర్యపోయేలా చేయొచ్చని ఎప్పటికప్పుడు కొందరు నిరుపిస్తూనే ఉన్నారు. అలాంటి ప్రతిభతో అంతార్జాతీయంగా పేరున్న రోల్స్‌రాయిస్ కంపెనీని ఆశ్చర్య పరిచాడు. రోల్స్‌రాయిస్, పోర్షియో లాంటి ఖరీదైన లగ్జీరియస్ కార్లలో తిరుగాలని కలలు కంటుంటారు. అందరికి సాధ్యపడవు. కొంత మంది ఔత్సాహికులు సాధారణ కార్లనే ఖరీదైన బ్రాండెడ్ కార్లగా మార్చడానికి ప్రయత్నించి విజయం సాధిస్తారు. అదే ఉత్సాహంతో కేరళ (Kerala) కు చెందిన హదీఫ్ సయీద్ రోల్స్‌రాయిస్ కారును తయారు చేశాడు.
హదీఫ్కు మొదటి నుంచి కార్లను రీమెడలింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. ఆ ఇష్టమే తనను వార్తల్లో నిలిచేలా చేసింది. మధ్యతరగతి కుటుంబాలు ఎక్కువగా ఉపయోగించే మారుతి 800 కారును ధనవంతులు మాత్రమే కొనగలిగే విలాసవంతమైన రోల్స్ రాయిస్ కారులా మార్చేశాడు. రోల్స్‌రాయిస్ లోగోనే స్ఫూర్తిగా తీసుకుని కొత్త లోగోను సృష్టించాడు. కారు ముందటి భాగాన్ని ఇప్పేసి.. కొత్త మెటిరీయల్తో ఆర్ఆర్ కారు మోడల్లా డిజైన్ చేసిన భాగాన్ని అతికించాడు. రోల్స్‌రాయిస్‌కు ఉన్నట్లు హెడ్లైట్లు, లుక్ వచ్చేలా తీర్చిదిద్దాడు. దీనికోసం భారీ మెటల్ షీట్లు, ఇతర కార్ల నుంచి వివిధ భాగాలను తీసుకున్నానని హదీఫ్ చెబుతున్నాడు. దృఢంగా ఉండేందుకు వెల్డింగ్ పద్ధతిలో పార్ట్స్‌ని అతికించినట్లు తెలిపాడు. ఈ మొత్తం తయారీకి తనకు సుమారు రూ.45 వేలు అయిందని వెల్లడించాడు. హదీఫ్ గతంలో మోటార్ సైకిల్ ఇంజిన్‌తో జీప్ తయారుచేసి ప్రపంచాన్ని ఆకర్షించాడు. వీడియోలను యూట్యూబ్ ఛానల్ ట్రిక్స్ ట్యూబ్‌లో అప్లోడ్ చేస్తుంటాడు. ఇప్పుడు రోల్స్ రాయిస్ కారు పోస్ట్ చేసి.. అందరినీ ఆశ్చర్య పరిచాడు.