ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) పై మరోసారి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు . ఎన్నికల దగ్గరపడుతున్న వేళ బీసీలు గుర్తుకొచ్చారని విమర్శించారు. బీసీలకు లక్ష రూపాయల సాయం అందించటంపై స్పందించిన ఆమె… ఓట్ల కోసం లక్ష సాయమంటూ ‘నయా’వంచనకు తెరలేపారని ఆరోపించారు. ఇప్పటికే దళితబంధు (Daḷitabandhu) పేరుతో దళితులను దగా చేశారని… గిరిజనబంధు (Girijanabandhu) అంటూ ఊరించి గిరిజనులను ఉసూరు మనిపించారని దుయ్యబట్టారు. ఇప్పుడు బీసీలను మోసం చేసేందుకు సిద్ధమయ్యారని అన్నారు. అసలు సిసలైన తెలంగాణ (Telangana) వాదులను సీఎం కేసీఆర్ అవమానపరుస్తున్నారని ఆరోపించారు. ఉద్యమాల పునాదులపై ఏర్పడ్డ రాష్ట్రంలో అసలు ఉద్యమకారులను సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని విమర్శించారు. తెలంగాణ అమరవీరుల స్థూప రూపకర్త యాదగిరి(Yadagiri)కి ఇంతవరకు బిల్లులు చెల్లించలేదని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడు తన బిల్లులు ఇస్తుందా అని తొమ్మిదేళ్లుగా 85 ఏళ్ల యాదగిరి ఎదరుచూస్తున్నారని, కానీ కేసీఆర్ ఆయనను ఏమాత్రం పట్టించుకోవడం లేదని అన్నారు. ఇంతకంటే దారుణమైన అవమానం తెలంగాణ పోరాట యోధులకు, మేధావులకు, కళాకారులకు వేరే ఉంటుందా అని షర్మిల ప్రశ్నించారు.