రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ(Vemulawada)లో భారతీయ జనతా పార్టీకి భారీ షాక్ తగిలింది. తుల ఉమ బీజేపీకి రాజీనామా చేశారు. తొలుత వేములవాడ టికెట్ కేటాయించినా ఆఖరి క్షణంలో బీఫామ్ ఇవ్వకపోవడంతో కాషాయ పార్టీకి గుడ్‌బై చెప్పారు.ఇప్పటికే కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ (Vinod Kumar) తుల ఉమతో సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇవాళ మంత్రి కేటీఆర్ సమక్షంలో తుల ఉమ బీఆర్ఎస్ (BRS) కండువా కప్పుకోనున్నారు. వేములవాడ అసెంబ్లీ స్థానం నుంచి తుల ఉమ బీజేపీ టికెట్ ఆశించారు. అయితే చివరి లిస్టులో తుల ఉమ పేరు ప్రకటించిన బీజేపీ (BJP) అధిష్టానం తర్వాత మార్పులు చేసింది.
చివరి నిమిషంలో తుల ఉమ అభ్యర్థిత్వాన్ని క్యాన్సిల్ చేసి.. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు తనయుడు వికాస్‌రావు(Vikas Rao)కు టికెట్ ఇచ్చింది. దీంతో తీవ్ర ఆవేదనకు లోనయ్యారు ఉమ. బీజేపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బుజ్జగింపుల కోసం బీజేపీ నేతలు వేస్తే చెప్పుతో కొడతానంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ (Bandi Sanjay) వల్లే తనకు టికెట్ నిరాకరించారని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జెడ్పీ చైర్‌పర్సన్‌గా 2019 వరకు పనిచేశారు. తుల ఉమ ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి ఈటల వెంట బీజేపీ కండువా కప్పుకున్నారు. దీంతో ఆమె తిరిగి సొంతగూటికి చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.