»The Owner Was Brutally Murdered For Not Giving A Bonus For Diwali
Nagpur : దీపావళికి బోనస్ ఇవ్వలేదని యజమాని దారుణ హత్య!
మహారాష్ట్రలోని నాగ్‌పుర్‌లో ఘోరం జరిగింది. దీపావళికి బోనస్ డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఇద్దరు ధాబా వర్కర్లు తమ యజమానిని కిరాతకంగా చంపిన ఘటన తీవ్ర కలకలం రేపింది.
మహారాష్ట్ర నాగ్‌పూర్(Nagpur)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. దీపావళి బోనస్ డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఇద్దరు వర్కర్లు దాబా యజమానిని అత్యంత కిరాతకంగా హత్య చేశారు. ఓ లేబర్ కాంట్రాక్టర్ ద్వారా నిందితులిద్దరూ రాజు ధెంగ్రే దాబా (Daba)లో వర్కర్లుగా చేరారు. అయితే, ఇటీవల యజమానితో కలిసి భోజనం చేస్తున్న సమయంలో నిందితులిద్దరూ తమకు దీపావళి బోనస్ అడగటంతో వివాదం తలెత్తినట్లు పోలీసులు (Police) తెలిపారు. నిందితులకు ఇంకేదైనా రోజు డబ్బులు ఇస్తానని ధెంగ్రే అంగీకరించినట్లు తెలిసింది. అయితే, అడిగిన వెంటనే డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో యజమానిని హతమార్చాలని కుట్రపన్నిన నిందితులు.. అదేరోజు నైట్ భోజనం అయ్యాక ధెంగ్రే నిద్రపోతున్న సమయంలో హత్య చేశారు.
ధెంగ్రే(Dhenge)నిదరపోతుండగా.. మెడకు తాడును బిగించి.. తలపై బండరాయితో కొట్టారు. పదునైన ఆయుధంతో దాడి చేశారు. దీంతో అతడి ముఖం ఛిద్రమైంది. అనంతరం ధెంగ్రే మృతదేహాన్ని ఓ బొంతలో కప్పి అతని కారులోనే అక్కడ్నుంచి పరారయ్యారు.ఈ క్రమంలో విహార్ గావ్ సమీపంలోని నాగ్‌పూర్-ఉమ్రెడ్ రహదారిపై డివైడర్(Divider)ను ఢీకొట్టడంతో నిందితులిద్దరికీ గాయాలయ్యాయి. దీంతో కారు దిగి దిఘోరి వైపు పారిపోతున్నట్లు సీసీటీవీ ఫుటేజీలో రికార్డయ్యింది. ఇది ఇలావుండగా, తన తండ్రికి ఎన్నిసార్లు ఫోన్ చేసిన తీయకపోవడంతో .. పక్కనేవున్న పాన్ దుకాణం నిర్వాహకుడికి ఫోన్ చేసింది ధింగ్రే కుమార్తె. దీంతో అక్కడికి వెళ్లిన అతడు.. ధింగ్రే రక్తపుమడుగులో ఉండటాన్ని చూసి ఆమెకు తెలిపాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.అయతే, ఈ దారుణానికి ఆర్థికపరమైన వ్యవహారమే కారణంగా కనిపిస్తోందని.. కాకపోతే అతడు మాజీ సర్పంచ్, స్థానికంగా పలుకుబడి కలిగిన వ్యక్తి కావడంతో రాజకీయ ప్రత్యర్థుల కుట్ర కోణం ఏమైనా ఉందా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్పీ వెల్లడించారు