»Mika As The Worlds First Robot Ceo It Employees Are Worried
First Robot CEO Mika : ప్రపంచంలోనే మొదటి రోబోట్ సీఈఓగా మికా..ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఓ కంపెనీ రోబోను సీఈవోగా నియమించింది. ఆ రోబో పేరు మికా అని, అది 24 గంటలు పనిచేస్తూనే ఉంటుందని కంపెనీ హెడ్ డేవిడ్ హాన్సన్ ప్రకటించారు. రోబోను సీఈవోగా ప్రకటించడంపై ఐటీ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నారు. భవిష్యత్తులో ఈ చర్య వల్ల అనేక ఉద్యోగాలు ఊడిపోయే అవకాశం ఉంది.
ప్రపంచంలోనే మొదటి రోబోట్ సీఈవోగా మికా (First Robot CEO Mika) అనే రోబోను నియమించారు. కొలంబియాలోని కార్టజేనాలో ఈ రోబో ఉంటుంది. డిక్టేడార్ అనే స్పిరిట్ బ్రాండ్‌గా ఈ రోబో ఉంది. దీనికి మికా అనే పేరు పెట్టారు. ఈ రోబోట్‌ను సీఈవోగా నియమించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మికా రోబో అనేది హాన్సన్ రోబోటిక్స్ కాగా ఇది డిక్టేడార్ పరిశోధనా ప్రాజెక్ట్‌లో భాగంగా రూపొందించారు. ఇది కంపెనీ రూల్స్, రెగ్యులేషన్‌కు బాగా సాయపడుతుందని నిపుణులు తెలిపారు. అలాగే ఈ హాన్సన్ రోబోటిక్స్ సోఫియా అనే మరో హ్యూమనాయిడ్ రోబోను కూడా సృష్టించి రికార్డు నెలకొల్పింది.
ఇప్పటికే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence ) ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఐటీ ఉద్యోగుల్లో (IT Employees) మరింత ఆందోళన నెలకొంది. ఇప్పుడు రోబోను ఏకంగా సీఈవో (Robot CEO)గా ప్రకటించడం పట్ల ఉద్యోగుల ఆందోళన మరింత ఎక్కువైంది. ఈ రోబో ఏఐ, మెషిన్ లెర్నింగ్ అల్టారిథమ్స్ వంటివాటిని వేగంగా, కచ్చితంగా సరిచూసి డేటా ఆధారిత నిర్ణయాలు తీసుకుంటుంది. సీఈవో నియామకం సందర్భంగా డిక్టేడార్ కంపెనీ మీటింగ్ ఏర్పాటు చేయగా అందులో సీఈవో మికా ప్రసంగించింది.
తనకు వారాంత సెలవులు లేవని, తాను ఎల్లప్పుడూ 24/7 వేళల్లో పనిచేస్తానని మికా వెల్లడించింది. ఎగ్జిక్యూటివ్ నిర్ణయాలను, ఏఐ అల్గారిథమ్స్‌ను వేగంగా తీసుకుంటానని, వ్యక్తిగత పక్షపాతం లేకుండా పనిచేస్తానని మికా వెల్లడించింది. ఎలాన్ మస్క్ (Elon Musk), జుకర్‌బర్గ్ సహా అనేక కంపెనీల సీఈవోల కంటే తాను మెరుగ్గా వేగంగా పనిచేస్తానని మికా తెలిపింది. మరోవైపు మికా రోబోపై తాము పూర్తి అవగాహనతో ఉన్నామని, ఆ రోబోట్ సీఈవోకు మరిన్ని బాధ్యతలను కూడా అప్పగిస్తామని హాన్సన్ కంపెనీ రోబోటిక్స్ సీఈవో డేవిడ్ హాన్సన్ వెల్లడించారు.