»Vaccine Is Ready For Chikungunya America Green Signal For Use Of Vaccine
Chikungunya: చికన్ గున్యాకు వ్యాక్సిన్ రెడీ..టీకా వినియోగానికి అమెరికా గ్రీన్ సిగ్నల్
ఇంత వరకూ ఎందరినో వేధించిన చికన్ గున్యాకు వ్యాక్సిన్ కనుగొన్నారు. అమెరికా ఈ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే దీనిపై మరిన్ని క్లినికల్ ట్రయల్స్ చేసి అందరికీ అందుబాటులోకి తీసుకొస్తామని అమెరికా ఆరోగ్య సంస్థ వెల్లడించింది.
ప్రతి ఏటా లక్షల మంది చికన్ గున్యా (Chikungunya) బారిన పడి నరకం అనుభవిస్తున్నారు. ఈ వైరస్ వల్ల జ్వరం, కీళ్ల నొప్పులు తీవ్రంగా వేధిస్తాయి. ఒళ్లంతా నొప్పులతో తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. చికన్ గున్యా సోకిన వ్యక్తికి మరో వ్యక్తి సాయంగా ఉంటేనే ఏపనైనా చేయగలుగుతాడు. ఈ వైరస్‌పై పరిశోధనలు సాగుతూనే ఉన్నాయి. దీన్ని కట్టడి చేసేందుకు నిపుణులు ప్రయోగాలు చేస్తూనే ఉన్నారు. తాజాగా చికన్ గున్యా వ్యాక్సిన్ (Vaccine) విషయంలో అమెరికా శుభవార్త చెప్పింది.
ప్రపంచంలోనే మొట్టమొదటిసారి చికెన్ గున్యా (Chikungunya) వైరస్ టీకాకు అమెరికా ఆరోగ్య సంస్థ అధికారులు ఆమోదం తెలిపారు. ఆ టీకా ట్రయల్స్‌లో మంచి ఫలితాలు రావడంతో అమెరికా ఆరోగ్య సంస్థ వ్యాక్సిన్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ వ్యాక్సిన్‌ను లిక్స్ చిక్ (Ixchiq) పేరుతో మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ టీకాను ఐరోపాకు చెందిన వాల్నేవా డెవలప్ చేసినట్లు తెలిపింది. 18 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్నవారు ఈ టీకాను వేసుకునేందుకు అర్హులని ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. చికెన్ గున్యా ఎక్కువగా వ్యాపించే ప్రాంతాల్లో దీనిని అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా యూఎస్ డ్రగ్ రెగ్యులేటర్ వెల్లడించింది.
ప్రస్తుతం చికన్ గున్యా (Chikungunya) అనేది ఆగ్నేయ ఆసియా, ఆఫ్రికా, అమెరికా ప్రాంతాల్లో ఎక్కువగా వ్యాపిస్తోంది. గత 15 ఏళ్లలో 5 మిలియన్లకు పైగా రోగులు ఈ చికన్ గున్యా బారిన పడుతున్నట్లు ఎఫ్‌డీఏ అధికారులు వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ కూడా రెండు వెర్షన్లలో అందుబాటులోకి తెస్తున్నామని, బలహీనంగా ఉన్నప్పుడు ఒక వ్యాక్సిన్, తీవ్రంగా ఉన్నప్పుడు మరో వ్యాక్సిన్ ఉంటుందని అమెరికా ఆరోగ్య సంస్థ అధికారులు తెలిపారు.
ఇప్పటి వరకూ ఈ వ్యాక్సిన్‌ని దాదాపు 4 వేల మందిపై క్లినికల్ ట్రయల్స్ చేశామని, అయితే ఈ వ్యాక్సిన్ వల్ల తలనొప్పి, కండరాలు, కీళ్ల నొప్పులు, అలసట, జ్వరం, వికారం వంటి దుష్ఫ్రభావాలు బయటపడ్డాయని తెలిపారు. దానిపై మరింత లోతుగా క్లినికల్ ట్రయల్స్ చేస్తున్నామని, త్వరలోనే పూర్తి స్థాయిలో చికన్ గున్యా వైరస్‌ను అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెరికా ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.