»Iceland Declared Emergency 800 Tremors In 14 Hours
Iceland: ఎమర్జెన్సీ ప్రకటించిన ఐస్ లాండ్
ఐస్ లాండ్లో వరుస భూ ప్రకంపనలు సంభవిస్తున్నాయి. అక్టోబర్ చివరి నుంచి ఇప్పటి వరకు 24 వేల భూకంపాలు వచ్చాయని వాతావరణ విభాగం తెలిపింది. ఇవి అగ్నిపర్వతాల విస్ఫోటకాలకు దారి తీయొచ్చని అధికారులు భావిస్తున్నారు. అత్యవసర పరిస్థితిని ప్రకటించి, ప్రజలను తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు.
Iceland declared emergency.. 800 tremors in 14 hours
Iceland: యూరప్‌కు చెందిన ఐస్లాండ్ (Iceland) ద్వీపంలో వరుస భూ ప్రకంపనలు (Earthquakes) భయపెడుతున్నాయి. దీంతో ప్రజలు గజ గజ వణికిపోతున్నారు. 14 గంటల్లో 800 ప్రకంపనలు వచ్చాయి. ఐస్లాండ్(Iceland)లో శుక్రవారం సాయంత్రం రాజధాని రెక్జావిక్కు 40 కిలోమీటర్ల సమీపంలో రెండు బలమైన ప్రకంపనలు వచ్చాయి. దాని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 5.2 గా నమోదైంది. ఆ ప్రాంతాల్లో రహదారులు ధ్వంసం అయి రాకపోకలు నిలిచిపోయాయి. అక్టోబర్ చివరి నుంచి రెక్జానెస్ ప్రాంతంలో 24వేల ప్రకంపనలు సంభవించాయని అధికారులు తెలిపారు.
తీవ్రమైన భూ ప్రకంపనల(Earthquakes)తో ఈ ప్రాంతం ప్రమాదకరమైన స్థితిలో ఉంది. దాంతో అత్యవసర పరిస్థితిని ప్రకటించినట్లు అధికారులు తెలిపారు. వీటి తీవ్రత మరింత ఎక్కువయ్యే అవకాశం ఉందని, ఇలాంటి వరుస ఘటనలు అగ్నిపర్వత విస్ఫోటాలకు దారితీస్తాయని భావిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిల్లో విస్ఫోటం( volcanic eruption) సంభవించే అవకాశం ఉందని ఐస్లాండ్ (Iceland) వాతావారణ విభాగం అంచనా వేసింది. భూ ప్రకంపనలు సంభవించిన ప్రాంతానికి మూడు కిలోమీటర్ల దూరంలో గ్రిండావిక్ అనే ప్రాంతం ఉంది. అక్కడ నాలుగువేల మంది ప్రజలు నివాసం ఉంటున్నారు. వారిని అక్కడి నుంచి సురక్షిత ప్రాంతానికి తరలించే ప్రయత్నాలు అధికారులు చేపట్టారు.