»President Droupadi Murmu Emergency Has Left A Big Stain On The Constitution Of India
President Droupadi Murmu: భారత రాజ్యాంగంపై ఎమర్జెన్సీ పెద్ద మచ్చలా మిగిలిపోయింది
1975 జూన్ 25న దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఎమర్జెన్సీపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్లో మాట్లాడారు.
President Droupadi Murmu: Emergency has left a big stain on the Constitution of India
President Droupadi Murmu: 1975 జూన్ 25న దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ఉభయసభలను ఉద్దేశించి పార్లమెంట్లో మాట్లాడారు. అయితే ముర్ము ఈ ఎమర్జెన్సీపై పార్లమెంట్లో మాట్లాడారు. రాజ్యాంగంపై జరిగిన అతిపెద్ద దాడి ఎమర్జెన్సీ అని అన్నారు. భారత రాజ్యాంగంపై ఎమర్జెన్సీ పెద్ద మచ్చలా మిగిలిపోయిందన్నారు. భారత్‌ను అతిపెద్ద మూడవ ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని ముర్ము తెలిపారు. అన్ని రంగాల్లో భారత్ ఆత్మనిర్భర్ దిశగా వృద్ధి చేస్తోందని తెలిపారు.
పేపర్ లీకేజీ వంటి విషయాల్లో దర్యాప్తు చేపట్టేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అలాగే ఈ అంశంపై ఉప రాష్ట్రపతి జగదీప్ ధంకర్ కూడా మాట్లాడారు. దేశంలో ఎమర్జెన్సీ విధించి రాజ్యాంగంపై దాడి చేశారన్నారు. అయితే దేశంలో ఎమర్జెన్సీ విధించడం వల్ల ఎలాంటి అనర్థాలు జరిగాయో ప్రధాని మోదీ తెలిపారు. మోదీతో పాటు కొత్తగా ఎన్నికైన స్పీకర్ ఓం బిర్లా, మరికొందరు మంత్రులు కూడా ఇటీవల ఆరోపణలు చేశారు. అయితే దేశంలో గత పదేళ్ల నుంచి అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోందని కాంగ్రెస్‌తో పాటు విపక్ష పార్టీలు కూడా ఆరోపిస్తున్నాయి.