»Tragedy In Brs Spiritual Gathering One Dead Six Injured
Fire accident : బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో విషాదం
ఖమ్మం జిల్లా(Khammam District) కారేపల్లి మండలం చీమలపాడు (Cimalapadu) గ్రామంలో విషాదం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం (atmiya sam meḷanam) లో బాణాసంచా(fireworks) తేల్చడంతో నిప్పురవ్వలు పూరి గుడిసె పై పడి దగ్దమైంది. మంటల వల్ల గుడిసెలోని గ్యాస్ సిలిండర్ (Gas cylinder)పేలి ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి.
ఖమ్మం జిల్లా(Khammam District) కారేపల్లి మండలం చీమలపాడు (Cimalapadu) గ్రామంలో విషాదం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ (BRS party) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనం (atmiya sam meḷanam) లో బాణాసంచా(fireworks) తేల్చడంతో నిప్పురవ్వలు పూరి గుడిసె పై పడి దగ్దమైంది. మంటల వల్ల గుడిసెలోని గ్యాస్ సిలిండర్ (Gas cylinder)పేలి ఒకరు మృతి చెందగా, ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరందరి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలిసింది. గ్రామంలోని యూపీఎస్ పాఠశాల పక్కనే ఉన్న జక్కుల రాములు (Jakkula ramulu) పూరి గుడిసెపై పడ్డాయి. ఈ నిప్పు రవ్వ చిలికిచిలికి గాలి వానై గుడిసెకు మంటలు వ్యాపించాయి. దీంతో గ్రామస్తులు పూరి గుడిసెకు అంటుకున్న మంటలను అదుపు చేసేందుకు ఆ మంటలపై నీళ్లు పోసేందుకు ప్రయత్నించారు. ప్రధానంగా నలుగురు వ్యక్తుల కాళ్లు తెగిపడ్డాయి.మరో వ్యక్తి పొట్టలోని పేగులు బయటకు వచ్చాయి. ఇలా అక్కడ మాంసపు ముద్దలతో సంఘటనా స్థలం హృదయ విదారకంగా మారింది.
ఈ విషయాన్ని తెలుసుకున్న పోలీసులు (police) వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను పోలీసు వాహనాల్లో ఖమ్మంలోని ప్రభుత్వ ఆసుపత్రి(Government Hospital)కి తరలించారు. గ్యాస్ బండ పేలిన సంఘటనతో ఏమి జరిగిందో తెలియక గ్రామస్తులు ఇంకా భయాందోళనలోనే ఉన్నారు. స్థానిక మీడియ తృటిలో ఈ అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు (MP Nama Nageswara Rao) వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ (MLA Ramulu Naik) వెంటనే జిల్లా కలెక్టర్ విపి గౌతమ్‌కు ఫోన్ చేసి క్షత్రగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం వల్ల గ్రామంలో అగ్ని ప్రమాదం (Fire accident) జరగటంతో గ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో గాయపడ్డ వారికి వైద్యం అందించాలని ఎంపీ నామా నాగేశ్వరరావు అధికారులని ఆదేశించారు. అవసరమైతే హైదారాబాద్‌కు తరలించాలని ఆయన సూచించారు. గుడిసెలో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడం వల్ల ప్రమాదం జరగడం బాధాకరమని, బాధితులకు అన్ని విధాలా అండాగా ఉంటామన్నారు. సిలిండర్ పేలడానికి, మీటింగ్‌కు సంబంధం లేదని ఎంపీ తెలిపారు