మంథని టికెట్ కోసం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి మూడు పార్టీలు మారారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్కు మారారు. అక్కడ టికెట్ ఇవ్వకపోవడంతో చివరకు బీఎస్పీలో చేరారు.
Challa Narayana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎమ్మెల్యే టికెట్ కోసం ఆశవాహులు గట్టిగానే ప్రయత్నిస్తున్నారు. ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచే పరిస్థితి లేదు. సో.. టికెట్ కోసం శక్తి మేర ట్రై చేస్తున్నారు. మంథనిలో ఓ అభ్యర్థి అయితే ఏకంగా మూడు పార్టీలు ఛేంజ్ చేశారు.
కాటారం సింగిల్ విండో చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి (Challa Narayana).. కాంగ్రెస్ పార్టీ నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. సర్పంచ్, జడ్పీటీసీ, నామినేటెడ్ పోస్టుల వరకు చేపట్టారు. కొద్దిరోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఇక్కడ పుట్ట మధు ఉన్నప్పటికీ బీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తానని అనుకున్నారు. కేసీఆర్ పుట్టినరోజున కాలేశ్వరంలో యాగం కూడా నిర్వహించారు. దాంతో పుట్ట మధు వర్సెస్ నారాయణ రెడ్డి (Challa Narayana) అన్నట్టు పడలేదు. ఎప్పుడూ ఏదో విషయమై కార్యకర్తల మధ్య గొడవ జరిగేది.
చివరకు మధుకు బీఆర్ఎస్ టికెట్ దక్కింది. బీఫామ్ ఇచ్చేవరకు వెయిట్ చేసి.. గత నెల 30వ తేదీన బీజేపీలో చేరారు. టికెట్ ఇస్తామని చెబితే చేరారు. కానీ కిషన్ రెడ్డి చందుపట్ల సునీల్ రెడ్డిని మంథని అభ్యర్థిగా ప్రకటించారు. దీంతో బీజేపీకి కూడా రాజీనామా చేశారు. మంగళవారం మంథని బీఎస్పీ అభ్యర్థిగా బీ పామ్ తీసుకున్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసేందుకు బీఎస్పీ టికెట్ తీసుకున్నారు. టికెట్ దక్కింది.. మరి విజయం వరిస్తుందో లేదో చూడాలి. ఎందుకంటే ఇక్కడ కాంగ్రెస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, బీఆర్ఎస్ నుంచి పుట్ట మధు ఉన్నారు.