»Brs Is Thinking Of Changing Its Name Again Errabelli Dayakara Raos Key Comment
Errabelli Dayakara Rao: బీఆర్ఎస్ పేరు మార్చే ఆలోచన ఉంది.
భారత రాష్ట్ర సమితి పార్టీ పేరు విషయంలో కీలక వ్యాఖ్యలు చేశారు ఎర్రబెల్లి దయాకర్ రావు. గతంలో టీఆర్ఎస్ పేరుతో ఉన్నప్పుడు ప్రజలకు మరింత చేరువగా ఉందని వెల్లడించారు.
BRS is thinking of changing its name again Errabelli Dayakara Rao's key comment
Errabelli Dayakara Rao: భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) పార్టీ పేరును మళ్లీ తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా మార్చే ఆలోచన చేస్తున్నట్లు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ పేరు ప్రజల్లోకి పెద్దగా వెళ్లలేదని, దాన్ని మన పార్టీ అనుకోలేదని, అందుకే ప్రజలకు చేరువైన టీఆర్ఎస్ అని వ్యవహిరించే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు ఆయన వెల్లడించారు. శనివారం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై స్పందించారు. ఆయనకు ఫోన్ ట్యాపింగ్‌తో ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు కావాలనే ఆయన్ను ఈ కేసులో ఇరికించే ప్రయత్నాలు జరుగుతున్నాయన్నాయని ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
బీఆర్ఎస్ నాయకులు పార్టీ మారుతున్న విషయంపై స్పందించారు. ఆయన కూడా పార్టీ మారుతున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి తనను జైలుకు పంపించినా వెళ్తాను కానీ పార్టీ మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతుంటే అక్రమ కేసులు పెట్టి తనను బెదిరించాలని చూస్తున్నట్లు పేర్కొన్నారు. గతంలో రైతుల కోసం ఎన్నోసార్లు పోలీసులతో లాఠీ దెబ్బలు తిని జైలుకు వెళ్లానని గుర్తు చేసుకున్నారు. ఎవరికి భయపడేది లేదని స్పష్టం చేశారు.