»The Competition Is To Break Conspiracies And Captures Gummadi Anuradha
Gummadi Anuradha: ఇక్కడి కుట్రలు, కబ్జాలను ఛేదించేందుకే పోటీ!
ఇల్లెందు నియోజకవర్గాన్ని కుట్రలు, కబ్జా రాజకీయాల నుంచి కాపాడేందుకు తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు గుమ్మడి అనురాధ ప్రకటించారు. తాను ఏ పార్టీలోనూ టికెట్ ఆశించడం లేదని, స్వతంత్రంగానే పోటీ చేస్తున్నానని వెల్లడించారు.
అసెంబ్లీ ఎన్నికలు (Assembly Elections) దగ్గరపడుతున్నాయి. ఈ తరుణంలో తెలంగాణ (Telangana)లో పొలిటికల్ హీట్ మరింత వేడెక్కింది. ప్రధాన పార్టీలన్నీ తమ తమ అభ్యర్థుల ఎంపికలో కుస్తీలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో భద్రాది కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు ఉస్మానియా పీజీ న్యాయ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ గుమ్మడి అనురాధ (Dr.Gummadi Anuradha) ప్రకటించారు.
ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఇల్లెందు నియోజకవర్గం నుంచి తాను స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య (Gummadi Narsaiah) కుమార్తె తెలుపడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది. బుధవారం ఆమె విలేకరుల సమావేశం నిర్వహించి తాను ఎన్నికల బరిలో నిలువనున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను బీఆర్ఎస్ (BRS) అభ్యర్థిగా బరిలో నిలవనున్నట్లు ప్రచారం జరిగిందని, ఆ పార్టీ నేతలు తనను సంప్రదించిన మాట వాస్తవమేనని అన్నారు. అయితే తాను మాత్రం ఏ పార్టీని కలవలేదన్నారు.
ఇప్పుడు జరుగుతున్న రాజకీయ పరిస్థితులను తాను స్వయంగా గమనించేందుకే నియోజకవర్గంలో పర్యటించినట్లు తెలిపారు. స్వచ్ఛమైన, స్వేచ్ఛా రాజకీయాలే లక్ష్యంగా రాజకీయాల్లోకి (Politics) రావాలని ప్రజలు, ప్రజా సంఘాలు స్వాగతించాయన్నారు. ఇల్లెందు నియోజకవర్గాన్ని కుట్రలు, కబ్జా రాజకీయాల బారి నుంచి కాపాడేందుకే తాను స్వతంత్ర అభ్యర్థిగా (Independent Member) పోటీచేస్తున్నట్లు తెలిపారు.
తన తండ్రికి తనకు మధ్య పోటీ ఉండదని, తన నిర్ణయాన్ని తన తండ్రి ఎప్పుడూ స్వాగతించారని గుమ్మడి అనురాధ (Dr.Gummadi Anuradha) అన్నారు. బీఆర్ఎస్ (BRS), కాంగ్రెస్ (Congress) పార్టీలల్లో ఏదోక పార్టీ నుంచి టికెట్ తనకు వస్తుందని ప్రచారం జరుగుతోందని, కానీ తాను మాత్రం స్వంత్రంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.