తెలంగాణ(Telangana)లో ఉపాధ్యాయుల బదిలీలకు లైన్ క్లియర్ అయింది. టీచర్ల బదిలీలకు హైకోర్టు తాజాగా అనుమతించింది. ఈ మేరకు గతంలో ఇచ్చిన మధ్యంతర స్టే ఉత్తర్వులను సవరిస్తూ తీర్పు వెలువరించింది. తుది తీర్పునకు లోబడి బదిలీలు ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. టీచర్ యూనియన్ (Teacher Union) నేతలకు 10 అదనపు పాయింట్లను తప్పు పట్టిన కోర్టు.. ఈ పాయింట్లు లేకుండానే బదిలీలను చేపట్టాలని కోరింది. అయితే, ఉపాధ్యాయ దంపతులకు అదనపు పాయింట్లు కేటాయింపును అనుమతించింది. భార్యాభర్తలు కలిసి ఉండాలన్నదే ఈ నిబంధన ఉద్దేశమని పేర్కొంది. దీంతో, ఉపాధ్యాయ దంపతుల కష్టాలకు చెక్ పడినట్టయింది.నిలిచి పోయిన టీచర్ల బదిలీల(transfers)ను పునఃప్రారంభించేందుకు, మళ్లీ దరఖాస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర సర్కారు కీలక ముందడుగు వేసింది. జీవో నెంబర్ 5, 9 లకు గతంలో అసెంబ్లీలో చట్టబద్ధత కల్పించింది.
ఉపాధ్యాయుల బదిలీలకు ఈ ఏడాది ప్రారంభంలోనే రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్ (Green signal) ఇచ్చింది. ట్రాన్స్ఫర్ల మార్గదర్శకాలతో కూడిన జీవో నెంబర్ 5ను జనవరి 25వ తేదీన విడుదల చేసింది. కొన్ని సవరణల తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన 9 జీవోను జారీ చేసింది. ఆ తర్వాత షెడ్యూల్ (Schedule) ను విడుదల చేసింది. ఈ మేరకు ఆన్ లైన్ లో దరఖాస్తులను కూడా స్వీకరించింది. దీంతో 79 వేలకు పైగా దరఖాస్తులు కూడా ప్రభుత్వానికి అందాయి. అయితే బదిలీలు ప్రారంభం కావాల్సిన తరుణంలో కొందరు ప్రభుత్వం బదిలీలపై ఇచ్చిన జీవోల చట్టబద్ధతను ప్రశ్నిస్తూ కేసులు వేశారు. దీంతో 7 నెలల నుంచి టీచర్ల ట్రాన్స్ఫర్ (Transfer of teachers) లు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. ఈ తరుణంలోనే రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది