ముంబై(Mumbai)లోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో ఐఎన్ఎస్ మహేంద్రగిరి యుద్ధ నౌకను సెప్టెంబర్ 1న జలప్రవేశం చేయనున్నది.ఉప రాష్ట్రపతి జగదీప్ ధంఖర్ భార్య సుదేష్ ధంఖర్ (Sudesh Dhankhar) ముంబైలోని మజాగాన్ డాక్ షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో దీనిని ప్రారంభించనున్నారు. ఇండియన్ నేవీ (Indian Navy) ఈ మేరకు ఒక ప్రకటనలో పెర్కోన్నాది. భారత నౌకాదళ స్వావలంబన, దేశం సాధించిన అద్భుతమైన పురోగతికి యుద్ధ నౌక మహేంద్రగిరి (Mahendragiri) లాంచ్ నిదర్శనమని అందులో తెలిపింది.
అడ్వాన్స్ వెపన్స్, సెన్సార్లు, ఫ్లామ్‌ఫామ్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ వంటి అభివృద్ధి చెందిన వ్యవస్థలు ఈ ఆధునాతన యుద్ధ నౌకలో ఉంటాయని వెల్లడించింది.కాగా, ప్రాజెక్ట్ 17ఏ (శివాలిక్ క్లాస్ ఫ్రిగేట్)లో భాగంగా ముంబైలోని మజాగాన్ డాక్ (Mazagon Dock) షిప్‌బిల్డర్స్ లిమిటెడ్‌లో నాలుగు, కోల్‌కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్‌లో మిగతా 13 యుద్ధ నౌకలను నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు నిర్మించిన స్టెల్త్ ఫ్రిగేట్‌లో మహేంద్రగిరి ఏడవది. దీనికి ముందు నిర్మించిన ఆరవ యుద్ధనౌక వింద్యాగిరిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) ఆగస్ట్ 17న ప్రారంభించారు