»A Police Officer Survived Cpr For A Person Who Fell On The Road Due To Heart Attack
Heart attackతో రోడ్డుపై పడిపోయిన వ్యక్తికి.. సీపీఆర్ చేసి బతికించిన పోలీస్ అధికారి
బేగంపేట హైద్రాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద గుండెపోటుతో పడిపోయిన వ్యక్తికి సీపీఆర్ చేసి ట్రాఫిక్ పోలీస్ అధికారి కాపాడారు. వెంటనే బాధితుడిని గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు.
హార్ట్ ఎటాక్ (Heart attack) అనేది ఎప్పుడు ఏ టైంలో వస్తుందో అంచనా వేయలేము. ఒక మనిషి మన కళ్ళ ముందే గుండెపోటుతో పడిపోతే సీపీఆర్ చేయడం ద్వారా తిరిగి ఆ మనిషిని బతికించుకోవచ్చు. సీపీఆర్ (CPR) అంటే కార్డియో పల్మొనరీ రెసస్కిటేషన్. సీపీఆర్ చేయడం వల్ల గుండెపోటు వచ్చిన వ్యక్తులను తిరిగి బతికించుకునే అవకాశం ఉంది. అదే పని చేశారు ఓ పోలీసు అధికారి. బేగంపేట(Begumpet)లోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ వద్ద గురజాల రాములు అనే వ్యక్తి రోడ్డుపై కుప్పకూలిపోయాడు. బాధితుడికి గుండెపోటు వచ్చిందని మధుసూధన్ రెడ్డి భావించాడు.వెంటనే రాములుకు ఆయన సీపీఆర్ చేశారు.
సీపీఆర్ చేయడంతో రాములులో కదలిక వచ్చింది.నార్త్ జోన్ ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి(Commissioner Madhusudan Reddy), ట్రాఫిక్ కానిస్టేబుల్ బాలయోగి తదితరులు ఆయనకు సీపీఆర్ చేసి కాపాడారు. ఆ తర్వాత వెంటనే ఆసుపత్రికి తరలించారు. అతని ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. బుధవారంలో ఓ వ్యక్తి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతనికి గుండెపోటు రావడంతో రోడ్డు మీద పడిపోయాడు. అక్కడే విధుల్లో ఉన్న ట్రాఫిక్ అధికారి మధుసూదన్ రెడ్డి అతనిని గమనించి సీపీఆర్ చేశారు. అతనికి ట్రాఫిక్ కానిస్టేబుల్ సహాయం చేశారు. ఆ తర్వాత అతనిని అంబులెన్స్‌లో గాంధీ ఆసుపత్రి(Gandhi Hospita)lకి తరలించారు. సకాలంలో స్పందించిన ట్రాఫిక్ అసిస్టెంట్ కమిషనర్ పైన ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.
Highly appreciate the timely efforts of Madhusudan Reddy Garu, Additional Commissioner of Traffic, North Zone, for performing #CPR on a man identified as Ramu who collapsed due to heart attack at Begumpet.