Megastar chiranjeevi: ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ వదులుకున్న చిరు..?
సినిమా ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు మొదటగా తమ కథను ఓ హీరోకు అనుకొని, తర్వాత మరో హీరోతో చేస్తుంటారు. అలా వెళ్లినవి కొన్ని హిట్ అవ్వచ్చు. అయితే మెగా స్టార్ చిరు చేయాల్సిన ఓ కథను మరో బాలీవుడ్ నటుడు చేయగా, బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్. మీరు షాకైనా ఇదే నిజం. ఈ ఆఫర్ మొదట చిరుకే వచ్చిందట. ఆయన రిజెక్ట్ చేయడంతో మనోజ్ వాజ్ పేయి చేతికి వెళ్లింది.
ఫ్యామిలీ మ్యాన్ (Familyman) కథను ముందుగా సినిమా తీయాలని అనుకున్నారట డైరెక్టర్స్ రాజ్, డీకే. స్టోరీ స్క్రిప్ట్ అంతా రెడీ చేసుకొని.. నిర్మాత అశ్వినిదత్ (Aswinidutt)ని కలిసి సబ్జెక్టు వినిపించారట. ఆ స్క్రిప్ట్ విపరీతంగా నచ్చడంతో.. వెంటనే కథను చిరంజీవి (megastar chiranjeevi)కి వినిపించడం జరిగిందట. అప్పటికి ఖైదీ నెం.150 మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న చిరు.. స్టోరీ బాగుంది కానీ ఇద్దరు పిల్లల తండ్రిగా చేయడం కష్టమని అన్నారట.
ఈ విషయాన్ని ఇటీవల అశ్వనీత్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. చిరు చేస్తే ఎలా ఉండేదో అని చాలా మంది అనుకుంటున్నారు. కానీ, నిజానికి చిరు చేయకపోవడమే మంచిదైంది. ఎందుకంటే కథ చాలా అద్భుతంగా ఉన్నా, చిరుకి ఆ కథ సెట్ కాదనే చెప్పాలి. అందులో చిరుని పెడితే, కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టాలి.
హీరోయిజం ఎలివేట్ చేయాలి. లేకుంటే సాధారణంగా చిరుని చూపిస్తే, ఎంత మంచి కథ అయినా ఫ్యాన్స్ కి నచ్చదు. అన్ని మార్పులు చేస్తే, కథలో అసలు సోల్ మిస్సయ్యే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఆ కథకి చిరు కంటే మనోజ్ కరెక్ట్ గా సెట్ అయ్యారనే చెప్పాలి.