తెలంగాణలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ (BJP) ప్రయత్నింస్తోందని బీఆర్ఎస్ (BRS)నేతలు మండిపడుతున్నారు.హిందీ పేపర్‌ను బండి వాట్సాప్‌కు పంపించడం కుట్ర కాదా ? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్ట్‌పై కేటీఆర్ ట్విట్టర్ (KTR Tweet) వేదికగా స్పందించారు. బండి అరెస్ట్‌పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్.
తెలంగాణలో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టించేందుకు బీజేపీ (BJP) ప్రయత్నింస్తోందని బీఆర్ఎస్ (BRS)నేతలు మండిపడుతున్నారు.హిందీ పేపర్‌ను బండి వాట్సాప్‌కు పంపించడం కుట్ర కాదా ? అని ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రంలో సంచలనంగా మారిన బండి అరెస్ట్‌పై కేటీఆర్ ట్విట్టర్ (KTR Tweet) వేదికగా స్పందించారు. బండి అరెస్ట్‌పై ఓ వ్యక్తి చేసిన ట్వీట్‌ను రీట్వీట్ చేసిన మంత్రి కేటీఆర్. ఆ ట్వీట్లో పేపర్ లీక్ కుంభకోణాల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందని చెప్పడానికి ఇది మరో నిదర్శనం అంటూ.. పేపర్ లీక్ చేసిన నిందితుడు, బీజేపీ నేతలతో సన్నిహితంగా ఉన్న ఫోటోలను షేర్ చేశారు. ఇక వాట్సాప్ గ్రూపుల్లో పేపర్ వైరల్ (Pepar vairal) చేసిన నిందితుడు బండి సన్నిహితుడు అంటూ అందులో తెలిపారు. సీఎం కేసీఆర్ (CM KCR) ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్రలు చేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ (Chief Whip Vinay Bhaskar) ఆగ్రహం వ్యక్తం చేశారు. కుట్రలు, కుతంత్రాలతో ప్రజల మనసు గెల్చుకోలేరన్నారు. లీకేజీలో బీజేపీ, ఆర్ఎస్ఎస్కు చెందిన వాళ్లు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికారని అన్నారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్లపై ఎందుకు చర్యలు తీసుకోకూడదు? అని ప్రశ్నించారు వినయ్ భాస్కర్.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని, చెప్పులతో కొట్టే రోజులు దగ్గరే ఉన్నాయన్నారు. ఈడీ, ఐటీ(ED, IT) దాడులతో బెదిరింపులకి దిగుతోందని, అయినప్పటికీ బెదిరే ముచ్చటే లేదని వినయ్ భాస్కర్ ఆరోపించారు.బండి సంజయ్‌పై నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ సంచలన కామెంట్లు చేశారు. పేపర్ లీకేజ్‌లో(Paper leakage) అతిపెద్ద కుట్రదారు బండి సంజయ్ అని అన్నారు. బండి సంజయ్ వాట్సాప్కే ఎందుకు పేపర్ వెళ్లింది? అని ప్రశ్నించారు. బీజేపీ వాట్సాప్ యూనివర్సిటీ కుట్రపూరితంగా.. తెలంగాణలో అంతర్గత సంక్షోభం సృష్టించాలని చూస్తోందని ఆరోపించారు సుదర్శన్. కేసీఆర్ ప్రభుత్వాన్ని బద్నామ్ చేయాలని చూస్తున్నారని ఫైర్ అయ్యారు. కొంతమందిని ఎంచుకుని కుట్రలకు తెరలేపుతున్నారని ఆరోపించారు సుదర్శన్. ఏ పేపర్ లీక్ (Paper Leak) అయినా.. దాని వెనుక బండి సంజయ్ (Bandi Sanjay) హస్తం ఉందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు (Rega Kantha rao) ఆరోపించారు. విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు, నీచ రాజకీయాలకు బీజేపీ (BJP) కేరాఫ్ అడ్రస్‌గా మారిందని విమర్శించారు. పేపర్ లీక్ చేసినవారెవరినీ వదిలేప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పేపర్ లీకేజ్ పాపం బండి సంజయ్దేనని ఆరోపించారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని రేగా సూచించారు
పిచ్చోని చేతిలో రాయి ఉంటే.. వచ్చి పోయేటోళ్ళకే ప్రమాదం…!!
కానీ అదే పిచ్చోని చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యానికే ప్రమాదం…!!!
తమ స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నా పత్రాలు లీకు చేసి అమాయకులైన విద్యార్ధుల, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న బీజేపి నాయకులు #BJPleakshttps://t.co/8GFI6ups6v