Raja Singh On Bandi Sanjay Arrest : బండి సంజయ్ అరెస్టు పై మండిపడ్డ రాజాసింగ్..!
Raja Singh : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టును బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా... బండి అరెస్టుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను కరీంనగర్ పోలీసులు అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అరెస్టును బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. తాజాగా… బండి అరెస్టుపై బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ మండిపడ్డారు. బండి అరెస్ట్ ను ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.
బండి సంజయ్ ను జైలుకు పంపితే భయపడతారని ప్రభుత్వం భావిస్తుందా అని రాజాసింగ్ ప్రశ్నించారు. అరెస్టులు చేస్తే ఇంట్లో కూర్చొంటారనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉందా అని ఆయన ప్రశ్నించారు. గతంలో కూడా ఇలానే ఆయనను జైలుకు పంపారన్నారు. ఆ సమయంలో కూడా బండి సంజయ్ భయపడలేదన్నారు. ఇప్పుడు అరెస్టు చేస్తే భయపడతారా అని ప్రశ్నించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. బండి సంజయ్ కు తెలంగాణ ప్రజలు మద్దతుగా నిలబడుతారని రాజాసింగ్ చెప్పారు. టెన్త్ క్లాస్ ప్రశ్నాపత్రాల లీక్ తో విద్యార్ధుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటమాడుతుందని రాజాసింగ్ ఆరోపించారు.
ఇదిలా ఉండగా… బండి సంజయ్ అరెస్టు పై ఆయన భార్య కూడా స్పందించారు. అరెస్ట్ చేసే సమయంలో సంజయ్ కు పోలీసులు టాబ్లెట్స్ వేసుకునే సమయం కూడా ఇవ్వలేదని ఆరోపించారు. మంచి నీళ్లు తాగేందుకు కూడా అనుమతివ్వలేదన్నారు. తన భర్తతో పోలీసులు చాలా దారుణంగా ప్రవర్తించారన్నారు. కనీసం ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో కూడా చెప్పలేదన్నారు. అరెస్ట్ సమయంలో ఆయన ముఖానికి గాయం కూడా అయిందన్నారు. తన తల్లి చిన్న కర్మలో సంజయ్ పాల్గొనకుండా చేశారన్నారు. అల్లుడు, కూతురు చేయాల్సిన కార్యక్రమాన్ని సైతం అడ్డుకున్నారని అపర్ణ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాలు చెప్పి విజ్ఞప్తి చేసినా పోలీసులు వినలేదన్నారు.