»House Motion Petition In High Court On Bandi Sanjays Arrest
High Court : బండి సంజయ్ అరెస్ట్‌పై హైకోర్టు లో హౌస్ మోషన్ పిటిషన్
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అక్రమ అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు (High Court) లో తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ (BJP Legal Cell) పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్ ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్(Habeas Corpus Petition) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. కాగా, సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు.
బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ (Bandi Sanjay Kumar) అక్రమ అరెస్ట్‌పై తెలంగాణ హైకోర్టు (High Court) లో తెలంగాణ బీజేపీ లీగల్ సెల్ (BJP Legal Cell) పిటిషన్‌ను దాఖలు చేసింది. బండి సంజయ్ ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హెబియస్ కార్పస్ పిటిషన్(Habeas Corpus Petition) దాఖలు చేశారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి (Chief Justice) నిర్ణయం తీసుకోనే అవకాశం ఉంది. కాగా, సంజయ్‌ను కరీంనగర్ పోలీసులు మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. కరీంనగర్ జ్యోతి నగర్‌లోని ఆయన ఇంటి నుంచి తీసుకెళ్లి యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. పదో తరగతి ప్రశ్న పత్రాల లీకేజీ కేసులోనే సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. ఆయనపై ఎఫ్ఐఆర్ (FIR) కూడా నమోదు చేశారు. కోర్టులో హాజరు పరిచనున్నారు. కానీ, ఏ కేసులో అరెస్ట్ చేశారు? ఎఫ్ఐఆర్ వివరాలను పోలీసులు వెల్లడించడం లేదు. మరోవైపు బండి సంజయ్ అరెస్ట్‌కు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ (BJP) పిలుపునిచ్చింది. 24 గంటల్లో బండి సంజయ్ ను కోర్టులో హాజరు పరిచే విధంగా ఆదేశాలు జారీ చేయాలని హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.
హైకోర్టు చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్ (Justice Ujjal Bhuyan) ఈ పిటిషన్ పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ పిటిషన్ ను అనుమతిస్తారా? లేదా ? పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బీజేపీ కార్యకర్తలు, పోలీసులకు మధ్య వాగ్వాదం నెలకొంది. తమ నాయకుడిని ఎందుకు అరెస్టు చేస్తున్నారో చెప్పాలంటూ బీజేపీ (BJP) కార్యకర్తుల సీఐ దామోదర్ కాళ్లు మొక్కారు. 151 సీఆర్ పీసీ కింద బండి సంజయ్ కు నోటీసులు ఇచ్చినట్లు, ప్రివెంటివ్ అరెస్టు చేసినట్లుగా పోలీసులు తెలిపారు. మరోవైపు సంజయ్ ను తిమ్మాపూర్ మీదుగా తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో పోలీసు వాహనం మోరాయించింది. దీంతో ఆయనను మరో వాహనంలో ఎక్కించారు. నల్గొండ జిల్లా బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ కు ఆయనను తరలించారు. పోలీస్ స్టేషన్ కు బీజేపీ కార్యకర్తలు, నాయకులు భారీగా తరలివస్తున్నారు. ఇక అర్ధరాత్రి వేళ తన ఇంట్లోకి చొరబడి తనను అక్రమంగా అరెస్టు చేయడాన్ని సంజయ్ తీవ్రంగా పరిగణిస్తున్నట్లు చెప్పారు. ఈ విషయంపై లోక్ సభ స్పీకర్ కార్యాలయానికి ఆయన ఫిర్యాదు చేయనున్నారు. సంజయ్ అరెస్టుకు నిరసనగా బీజేపీ కార్యకర్తలు కరీంనగర్ లో సీఎం కేసీఆర్ (CM KCR) దిష్టిబొమ్మ దగ్ధం చేశారు. సంజయ్‌ను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
బండి సంజయ్ ను అరెస్టు చేయడం పట్ల బీజేపీ నేతలు ఫైర్ అయ్యారు. ఏ కారణం లేకుండా తప్పుడు ఆరోపణలు చేసి బండి సంజయ్ ను అరెస్టు చేశారంటూ బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి(Gujjula Premender Reddy) మండిపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గాలను బండి సంజయ్ ధైర్యంగా ఎదుర్కొంటున్నారని చెప్పారు. బండి సంజయ్ అక్రమంగా అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భాను ప్రకాశ్ అన్నారు. వెంటనే విడుదల చేసి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.మరోవైపు బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ నాయకత్వం తీవ్రంగా పరిగణించింది. అవినీతిలో కూరుకుపోయిన బీఆర్ఎస్ నాయకత్వం.. పాలన చేతకాక బండి సంజయ్ ను అరెస్టు చేసిందని బీజేపీ జాతీయ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోశ్ (BL Santosh) ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ మునిగిపోయే నావ అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు రాజకీయ సమాధి అయ్యే రోజులు దగ్గర పడ్డాయన్నారు.