»Telangana Nims Creates History Hospital Performs 50 Kidney Transplants Within 4 Months
NIMS దవాఖానా అరుదైన ఘనత.. 4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడిలు
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు సహకారంతో నిమ్స్ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో ఈ శస్త్ర చికిత్సలు చేస్తున్నారు. అవయవ మార్పిడి ఆరోగ్య శ్రీలో చేర్చడంతో పేదలకు కిడ్నీ, కాలేయం వంటి ఖరీదైన అవయవ మార్పిడిలు కూడా ఉచితంగా అందుతున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం (Govt of Telangana) తీసుకుంటున్న చర్యలతో నిమ్స్ ఆస్పత్రి (NIMS Hospital) మరో ఘనత సాధించింది. కార్పొరేట్ ఆస్పత్రులకు సాధ్యం కాని రికార్డును సొంతం చేసుకుంది. కేవలం 4 నెలల్లో ఏకంగా 50 కిడ్నీ మార్పిడి (Kidney Transplant) శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిమ్స్ ఆస్పత్రిలో జరిగాయి. అవి కూడా పూర్తి ఉచితంగా చేసి దేశంలోనే సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఈ ఘనత సాధించడంపై తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు (Harish Rao) హర్షం వ్యక్తం చేశారు. నిమ్స్ అధికారులు, వైద్యులను అభినందించారు.
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు 4 నెలల్లో 50 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు చేసినట్లు నిమ్స్ అధికారులు ప్రకటించారు. వీటిలో 28 లైవ్ (Live) ట్రాన్స్ ప్లాంట్, 22 క్యాడవర్ ట్రాన్స్ ప్లాంట్ ఉన్నాయి. జనవరిలో 15, ఫిబ్రవరిలో 10, మార్చి 10, ఏప్రిల్ 15 శస్త్ర చికిత్సలు జరిగాయి. సీఎం కేసీఆర్ (KCR), మంత్రి హరీశ్ రావు సహకారంతో నిమ్స్ ఆస్పత్రిలో పెద్ద సంఖ్యలో ఈ శస్త్ర చికిత్సలు చేసినట్లు నిమ్స్ యూరాలజీ విభాగం హెడ్ డాక్టర్ రాహుల్ దేవరాజ్ (Dr Rahul Devraj) తెలిపారు. అవయవ మార్పిడి ఆరోగ్య శ్రీలో చేర్చడంతో పేదలకు కిడ్నీ, కాలేయం వంటి ఖరీదైన అవయవ మార్పిడిలు కూడా ఉచితంగా అందుతున్నాయి. కాగా ఒక్క కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సకు దాదాపు రూ.15 లక్షల దాకా ఖర్చవుతుంది. కానీ నిమ్స్ లో ఆరోగ్య శ్రీ (Arogya Sri) ద్వారా పేదలకు ఉచితంగా ఈ శస్త్ర చికిత్సలు చేశారు.
నిమ్స్ ఆస్పత్రిలో కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు 1989లో ప్రారంభమయ్యాయి. అప్పటి నుంచి 2014 వరకు 24 ఏళ్లల్లో 600 కిడ్నీ మార్పిడి శస్త్ర చికిత్సలు జరిగాయి. తెలంగాణ రాష్ట్రం (Telangana) ఏర్పడిన అనంతరం నిమ్స్ లో ఆ శస్త్ర చికిత్సల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. తొమ్మిదేండ్లలో 862 శస్త్ర చికిత్సలు జరిగాయి. వీటిలో 522 లైవ్ ట్రాన్స్ ప్లాంట్స్, 340 కాడవర్ కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్ ఉన్నాయి. అవయవ మార్పిడి (Organ transplant) చికిత్సలు కూడా భారీగా పెరిగాయి.
Congratulations to NIMS Hospital for completing 50 successful kidney transplant surgeries in just 4 months!
Under the visionary leadership of CM Shri #KCR garu, free medical expenses worth ₹15lakhs through Aarogyasri, has given a new ray of hope to Organ Transplant patients. A… pic.twitter.com/0ELMVoPa95