ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu)పై.. తాను పుస్తకం రాశానని.. వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీపార్వతి (Nandamuri Lakshmi Parvathi ) అన్నారు. ‘దానికి అల్లుడు సుద్దులు'(Alluḍu suddulu) అని పేరు పెట్టినట్టు వెల్లడించారు. త్వరలోనే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తానని ఆమె ప్రకటించారు. అలాగే టీడీపీ (TDP) ఇటీవల ప్రకటించిన మినీ మేనిఫెస్టోపై కూడా లక్ష్మీపార్వతి పంచ్‌లు పేల్చారు. లోకేష్ (LOKESH) పాదయాత్రపైనా సెటైర్లు వేశారు. టీడీపీ మేనిఫెస్టో అంతా మోసపూరిత హామీలే. పథకాలతో రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని చంద్రబాబు గతంలో ప్రచారం చేశారు. ఇప్పుడు టీడీపీ మేనిఫెస్టో గురించి ఏమంటారు.
బాబు హామీల అమలుకు ఆర్బీఐ (RBI) సొమ్ము కూడా చాలదు. గతంలో జగన్ హామీలు ఇచ్చినప్పుడు, అమలు చేస్తున్నప్పుడు ఆయన మాట్లాడిన మాటలను ఎవరూ మర్చిపోరు. లోకేష్‌ది పాదయాత్ర కాదు.. ఈవినింగ్ వాక్’ అని లక్ష్మీపార్వతి సెటైర్లు వేశారు. యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ మాటలు చూస్తుంటే అసహ్యమేస్తోందన్నారు. సీఎం జగన్ (CM JAGAN)పై ఆయన చేస్తున్న వ్యాఖ్యలు అత్యంత దారుణంగా ఉన్నాయని లక్ష్మీపార్వతి మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో నందమూరి లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వైఎస్ జగన్‌పై నారా లోకేశ్ వ్యక్తిగత విమర్శలు చేయడం నీచ సంస్కారానికి నిదర్శనమని ఫైర్ అయ్యారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)పైనా లక్ష్మీపార్వతి తనదైన స్టైల్లో విమర్శలు చేశారు. చంద్రబాబు ఆదేశాలతోనే పవన్ ప్రచార వాహనం వారాహి రోడ్డెక్కుతోందని ఆమె ఆరోపించారు