Tspsc paper leak:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Tspsc paper leak) కేసులో సిట్ (sit) దర్యాప్తు కొనాసగుతోంది. కాసేపటి క్రితం సిట్ (sit) అధికారులు టీఎస్ పీఎస్సీ (tspsc) కార్యాలయానికి చేరుకున్నారు. వివిధ అంశాలపై సిబ్బందిని ప్రశ్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు ప్రవీణ్ (praveen) క్యాబిన్లో తనిఖీలు చేపట్టారు. ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనే కోణంలో సిట్ దర్యాప్తు జరుగుతోంది.
పేపర్ లీకేజీ ఇష్యూలో ప్రధాన నిందితుడు ప్రవీణ్ (praveen) రాసలీలల గురించి సిట్ అధికారులు కూపీ లాగుతున్నారు. టీఎస్ పీఎస్సీకి (ts psc) వచ్చే మహిళలను అతను ట్రాప్ చేశాడని అధికారులు గుర్తించారు. 40 మంది (40) మహిళలతో అతను చాట్ చేశాడని పేర్కొన్నారు. మహిళలతో పరిచయం పెంచుకొని.. వారిని నగ్నంగా వీడియోకాల్స్ మాట్లాడాలని ప్రవీణ్ ఒత్తిడి చేశాడట. అతని ఫోన్‌ను సిట్ అధికారులు సీజ్ చేశారు.
పేపర్ లీకేజ్ అంశంలో పోరాడిన బీజేవైఎం కార్యకర్తలపై (bjym) కేసులు పెట్టడాన్ని బండి సంజయ్ (bandi sanjay) తప్పుపట్టారు. న్యాయం చేయాలని పోరాడితే కేసులతో వేధిస్తారా అని అడిగారు. నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న వారిపై మాత్రం చర్యలు ఉండవు అని మండిపడ్డారు. బీజేవైఎం కార్యకర్తలను తక్షణమే విడుదల చేయాలని కోరారు. వారిపై నాన్ బెయిలబుల్ కేసులను పోలీసులు ఫైల్ చేసిన సంగతి తెలిసిందే. ఇటు నయీం, డ్రగ్స్, డేటా చోరీ కేసులను సిట్‌కు అప్పగిస్తే నీరుగారిపోయిందని బండి సంజయ్ గుర్తుచేశారు. ఇప్పుడు ఈ కేసును కూడా సిట్‌కు అప్పగించారని.. దీంతో ఈ కేసు కూడా అంతేనా అని పేర్కొన్నారు.
పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ (praveen) గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అతను 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడట. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నట్టు తెలిసింది. న్యూడ్ కాల్స్ మాట్లాడాలని ఒత్తిడి చేశాడని ఇప్పుడు తెలిసింది.