Actor balakrishna warns to ycp mla gopireddy srinivas reddy
Balakrishna warns to ycp mla:వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి (Gopireddy srinivas reddy) నందమూరి బాలకృష్ణ (Balakrishna) వార్నింగ్ ఇచ్చారు. పొలిటిషీయన్ పొలిటిషీయన్గానే ఉండాలని.. దిగజారి ప్రవర్తించొద్దు అని హితవు పలికారు. తన సినిమాలోని పాట (song) పెట్టిన కార్యకర్తను ఎమ్మెల్యే గోపిరెడ్డి వేధించారట. ఈ విషయం బాలకృష్ణకు (Balakrishna) తెలియడంతో ఎమ్మెల్యేకు వార్నింగ్ ఇచ్చారు.
ఓ కార్యక్రమంలో బాలకృష్ణ (Balakrishna) మూవీలో ఓ పాటను వైసీపీ కార్యకర్త భాస్కర్ రెడ్డి (bhaskar reddy) పెట్టారు. ఈ విషయం ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డికి (srinivas reddy) నచ్చలేదు. అతనిని ఇబ్బందులకు గురిచేసినట్టు తెలిసింది. దీంతో భాస్కర్ రెడ్డి.. ఎమ్మెల్యే ఇంటిముందు ఆత్మహత్యాయత్నం చేశారు. విషయం బాలకృష్ణ (Balakrishna) వరకు వెళ్లింది. దీంతో ఆయన స్పందిస్తూ.. ఇంకోసారి ఇలాంటిది జరిగితే మాత్రం ఊరుకోను. చిటికేస్తే, మూడో కన్నుతెరిచానంటే చూస్కోండి జాగ్రత్త. రాజకీయ నాయకుడిగా తన పైకి వస్తానంటే రండి. తాను రెడీ అన్నారు. సినిమాల విషయానికి రావొద్దు. మీ పరిధిలో మీరు ఉండండని బాలకృష్ణ హెచ్చరించారు. సినిమాలు (cinema) వేరు.. రాజకీయాలు (politics) వేరు అని ఆయన స్పష్టంచేశారు. తన సినిమాలను అన్నీ పార్టీల వారు చూస్తారని చెప్పారు. నటులకు (actors) అన్నివర్గాల్లో అభిమానులు ఉంటారని తెలిపారు. అలా ఓ పాట పెడితే.. వేధించడం కరెక్ట్ కాదని అన్నారు. మళ్లి ఇలాంటి ఘటన పునరావృతం కాకుండా చూడాలని బాలకృష్ణ (Balakrishna) కోరారు.
నిజమే.. సినిమాలు వేరు.. రాజకీయాలు వేరు. ఓ కార్యక్రమంలో బాలయ్య (Balakrishna) పాట పెడితే.. ఎమ్మెల్యే (mla) వద్దనడంతో.. రచ్చ రచ్చ అయ్యింది. పార్టీలు వేరు.. రాజకీయాలు వేరు.. దేనికదే ప్రత్యేకం అని చెప్పారు. తనంటే అభిమానంతో పాట పెడితే.. వద్దనడం కరెక్ట్ కాదని బాలయ్య అన్నారు. ఇదే అంశంపై ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్పందించాల్సి ఉంది.