»Ys Sharmila Meets National Commission Of Women Chairperson
National commission of women chairpersonతో షర్మిల భేటీ.. వారిపై ఫిర్యాదు
YS Sharmila:దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) బిజీగా ఉన్నారు. నిన్న జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు జాతీయ మహిళ కమిషన్‌ను ( national commission of women) కలిశారు. BRS పార్టీ నేతలపై మహిళ కమిషన్‌కు ఆమె ఫిర్యాదు (complaint) చేశారు.
YS Sharmila meets national commission of women chairperson
YS Sharmila:దేశ రాజధాని ఢిల్లీలో వైఎస్ఆర్ టీపీ చీఫ్ షర్మిల (YS Sharmila) బిజీగా ఉన్నారు. నిన్న జంతర్ మంతర్ (jantar mantar) వద్ద దీక్ష చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ రోజు జాతీయ మహిళ కమిషన్‌ను ( national commission of women) కలిశారు. BRS పార్టీ నేతలపై మహిళ కమిషన్‌కు ఆమె ఫిర్యాదు (complaint) చేశారు. తనను దూషించిన వీడియోలను (video) కమిషన్ ముందు ఉంచారు. మహిళలు (women) అనే గౌరవం వారికి లేదన్నారు. ప్రజా సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న తనపై దాడులకు దిగుతున్నారని షర్మిల పేర్కొన్నారు.
పబ్లిక్‌గా ఎలా తిరుగుతావో చూస్తాం అని బెదిరిస్తున్నారని వైఎస్ షర్మిల (sharmila) తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు (women) గౌరవం లేదు, రక్షణ కూడా లేదన్నారు. సీఎం కేసీఆర్ (kcr).. ఆయన కుమారుడు కేటీఆర్ (ktr) ఆడవాళ్ళు అంటే వ్రతాలు చేసుకోవాలి అంటారని గుర్తుచేశారు. ఓ మంత్రి మరదలుతో సమానం అట.. ఓ ఎమ్మెల్యే మహిళని కొజ్జా అని అంటున్నాడని షర్మిల పేర్కొన్నారు. ప్రజా సమస్యలు ఎత్తి చూపిస్తే శిఖండి అని వ్యక్తిగతంగా విమర్శిస్తున్నారని వాపోయారు. వైఎస్ షర్మిల (sharmila) ఇచ్చిన ఫిర్యాదుపై సానుకూలంగా మహిళా కమిషన్ చైర్ పర్సన్ రేఖ శర్మ (rekha sharma) స్పందించారు. అసభ్య పదజాలంతో దూషించిన వారిపై చర్యలు తీసుకుంటామని హామీ నిచ్చారని వైఎస్ఆర్ టీపీ నేతలు చెబుతున్నారు.
మంత్రి నిరంజన్ రెడ్డి షర్మిలను (sharmila) మరదలు అని పిలిచిన సంగతి తెలిసిందే. దానిపై ఆమె ఎవడురా నీకు మరదలు అని గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ (shankar naik).. షర్మిల (sharmila) కొజ్జాలా ఉన్నారని కామెంట్ చేశారు. దీంతో ఆమె కూడా శంకర్ నాయక్‌ను కొజ్జా అని అన్నారు. షర్మిల కామెంట్లపై హైదరాబాద్‌లో హిజ్రాలు కూడా ధర్నా చేపట్టారు. దీంతో షర్మిల మిమ్మల్ని అలా అనలేదని.. ఎమ్మెల్యే మాటలనే గుర్తుచేశానని వివరించారు. ఒకవేళ మనసు నొప్పించి ఉంటే క్షమించాలని సారీ కూడా చెప్పారు. దీంతో వివాదం సద్దుమణిగింది.
షర్మిల (sharmila) నిన్న ఢిల్లీలో సీఎం కేసీఆర్ (cm kcr) అవినీతి పాలన గురించి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద దీక్షకు దిగారు. ఢిల్లీ పోలీసులు (delhi police) షర్మిలను అరెస్ట్ చేయడంతో.. పోలీసులు, వైఎస్ఆర్ టీపీ శ్రేణుల మధ్య వాగ్వాదం జరిగింది. తర్వాత షర్మిల పార్లమెంట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసీఆర్ పాలన, కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి గురించి షర్మిల (YS Sharmila) నిరసన చేపట్టారు. కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.