Tspsc question paper leak case సిట్‌కు అప్పగింత.. ఉత్తర్వులు జారీ
Tspsc question paper leak:తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ కొశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ను (sit) ఏర్పాటు చేసింది.
Tspsc question paper leak:తెలంగాణ రాష్ట్రంలో సంచలనం రేపిన టీఎస్ పీఎస్సీ కొశ్చన్ పేపర్ లీకేజీ ఘటనపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణ కోసం ప్రత్యేకంగా సిట్‌ను (sit) ఏర్పాటు చేసింది. అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఉద్యోగాల పరీక్ష పేపర్లు లీకయ్యాయి. దాంతోపాటు అసిస్టెంట్ ఇంజినీర్ కొశ్చన్ పేపర్ కూడా ప్రవీణ్ (praveen) అండ్ కో లీక్ చేసినట్టు గుర్తించారు. అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) కొశ్చన్ పేపర్ లీకేజీ ఇష్యూలో దర్యాప్తును సీసీఎస్ పోలీసులకు (ccs police) తెలంగాణ ప్రభుత్వం అప్పగించింది. సీసీఎస్ సిట్ బృందం ఎంక్వైరీ చేయనుందని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ ఇంజినీర్ ఎగ్జామ్ కొశ్చన్ పేపర్ లీకయ్యిందని ఈ నెల 13వ తేదీన ఫిర్యాదు అందిందని వివరించారు. సెక్షన్ 409, 420, 120(బి)తో పాటు ఐటీ చట్టంలోని 66సి, 66బి, 70 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారని వెల్లడించారు. గ్రూప్-1 ప్రీలిమ్స్ పరీక్ష కూడా లీకయ్యిందని వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అదేం లేదని.. దానికి సంబంధించి కేసు ఫైల్ చేయలేదని సంబంధిత పోలీసు అధికారులు మీడియాకు తెలిపారు.
పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ (praveen) గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అతను 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడట. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నట్టు తెలిసింది.
మొబైలోలో మహిళలతో ఉన్న అసభ్యకర ఫొటోలు, వాట్సాప్ నెంబర్లను గుర్తించారు. స్త్రీలు (woman) అంటే ప్రవీణ్‌కు వెర్రీ అని పోలీసులు అంచనా వేశారు. గతేడాది అతనికి టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పీఏగా ప్రమోషన్ (promotion) వచ్చింది. అధికారుల వద్ద నమ్మకంగా ఉంటూ.. వారి నమ్మకాన్ని వమ్ము చేశాడు. ప్రవీణ్ (praveen), రేణుక (renuka) మొబైల్స్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్నకు పంపించారు. వారి మధ్య జరిగిన చాటింగ్ రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.