»Big Conspiracy To The Paper Leak Issuebandi Sanjay
Paper leak వెనక కుట్ర.. బండి సంజయ్ సంచలనం
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Paper leak) అంశంపై అగ్గిరాజేసింది. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. పేపర్ లీకేజీ అంశంవెనక పెద్ద కుట్ర (Conspiracy) దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. చైర్మన్, సెక్రటరీకి తెలియకుండా లీకేజీ (leak) జరిగి ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
Big Conspiracy to the paper leak issue:bandi sanjay
Bandi sanjay:టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ (Paper leak) అంశంపై అగ్గిరాజేసింది. బీజేవైఎం (bjym) కార్యకర్తలు టీఎస్ పీఎస్సీ కార్యాలయం (tspsc office) వద్ద ఆందోళనకు దిగారు. ఆర్టీసీ క్రాస్ రోడ్స్ (rtc x roads) వద్ద విద్యార్థులు నిరసనకు దిగారు. ఈ అంశంపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (bandi sanjay) స్పందించారు. పేపర్ లీకేజీ అంశంవెనక పెద్ద కుట్ర (Conspiracy) దాగి ఉందని సంచలన ఆరోపణలు చేశారు. చైర్మన్, సెక్రటరీకి తెలియకుండా లీకేజీ (leak) జరిగి ఉండదని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.
కాన్ఫిడెన్షియల్ డిపార్ట్ మెంట్ చైర్మన్ (chairman) పరిధిలో ఉంటుందని బండి సంజయ్ (bandi sanjay) తెలిపారు. ఆయనకు తెలియకుండా పేపర్ లీక్ (paper leak) కావడం సాధ్యం కాదని చెప్పారు. కొశ్చన్ పేపర్ (question paper) ఏ ఉద్యోగి కంప్యూటర్లో ఉండేందుకు వీలు లేదన్నారు. ఓ సెక్షన్ ఆఫీసర్ (section officer) కంప్యూటర్లో ఎలా ప్రత్యక్షం అయ్యిందని ప్రశ్నించారు. చైర్మన్, సెక్రటరీకి తెలియకుండానే అతని కంప్యూటర్లో సాప్ట్ కాపీ వచ్చిందా అని సంజయ్ ప్రశ్నించారు.
పేపర్ లీక్ చేసిన ప్రవీణ్ (praveen) గురించి ఆసక్తికర విషయాలు వెలుగుచూస్తున్నాయి. అతను 2017లో జూనియర్ అసిస్టెంట్‌గా (junior assistant) చేరాడు. టీఎస్ పీఎస్సీ వెరిఫికేషన్ విభాగంలో పనిచేసిన సమయంలో.. అప్లికేషన్లలో వచ్చిన పొరపాట్లను సరిదిద్దుకునేందుకు వచ్చిన మహిళలతో (woman) మాట కలిపేవాడట. సమస్య పరిష్కరించి.. నంబర్ తీసుకునేవాడట. వారిలో కొందరితో సంబంధం కూడా పెట్టుకున్నట్టు తెలిసింది.
మొబైలోలో మహిళలతో ఉన్న అసభ్యకర ఫొటోలు, వాట్సాప్ నెంబర్లను గుర్తించారు. స్త్రీలు (woman) అంటే ప్రవీణ్‌కు వెర్రీ అని పోలీసులు అంచనా వేశారు. గతేడాది అతనికి టీఎస్ పీఎస్సీ కార్యదర్శి పీఏగా ప్రమోషన్ (promotion) వచ్చింది. అధికారుల వద్ద నమ్మకంగా ఉంటూ.. వారి నమ్మకాన్ని వమ్ము చేశాడు. ప్రవీణ్ (praveen), రేణుక (renuka) మొబైల్స్ పోలీసులు ఫోరెన్సిక్ ల్యాబ్నకు పంపించారు. వారి మధ్య జరిగిన చాటింగ్ రికవరీ చేసే పనిలో పోలీసులు ఉన్నారు.
పేపర్ లీకేజీ అంశం టీఎస్ పీఎస్సీని (tspsc) కుదిపేస్తోంది. ఇప్పటికే టీపీబీవో (tpbo), వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేశారు. ఏఈ (ae) పరీక్ష రద్దుపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. పేపర్ లీక్ చేసిన ప్రవీణ్‌ను (praveen) ఇప్పటికే సస్పెండ్ చేసి.. శాఖపరమైన విచారిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని (rajashekar reddy) విధుల్లోంచి తొలగించాలని డిసిషన్ తీసుకున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (group-1 prelims) పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలు కలుగుతున్నాయి.