Tspsc name plate ధ్వంసం.. బీజేవైఎం కార్యకర్తల ఆందోళన, సిట్టింగ్ జడ్జీతో విచారణ అని
Tspsc name plate:పేపర్ లీకేజ్ అంశం టీఎస్ పీఎస్సీని (Tspsc) కుదిపేసింది. ఈ రోజు కార్యాలయం వద్దకు బీజేవైఎం కార్యకర్తలు (bjym) వచ్చారు. పోలీసులను (police) తోసుకుంటూ లోపలికి దూకేందుకు ప్రయత్నించారు. పలువురిని పోలీసులు (police) అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువతతో కమిషన్ (commission), ప్రభుత్వం (government) ఆడుకుంటున్నాయని బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు.
Tspsc name plate:పేపర్ లీకేజ్ అంశం టీఎస్ పీఎస్సీని (Tspsc) కుదిపేసింది. ఈ రోజు కార్యాలయం వద్దకు బీజేవైఎం కార్యకర్తలు (bjym) వచ్చారు. పోలీసులను (police) తోసుకుంటూ లోపలికి దూకేందుకు ప్రయత్నించారు. పలువురిని పోలీసులు (police) అడ్డుకుని.. అరెస్ట్ చేశారు. నిరుద్యోగ యువతతో కమిషన్ (commission), ప్రభుత్వం (government) ఆడుకుంటున్నాయని బీజేవైఎం కార్యకర్తలు ఆగ్రహాం వ్యక్తం చేశారు. పేపర్ లీకేజీ (paper leak) ఘటనపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ యువతకు తగిన న్యాయం చేయాలని కోరుతున్నారు.
కొశ్చన్ పేపర్ లీకేజ్ (paper leak) అంశంపై విపక్షాలు ఆందోళనకు దిగాయి. బీజేవైఎం కార్యకర్తలు, టీజేఎస్ విద్యార్థి సంఘం నాయకులు నాంపల్లిలో (nampally) గల టీఎస్ పీఎస్సీ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీజేవైఎం (bjym) కార్యకర్తలు టీఎస్ పీఎస్సీ బోర్డును ధ్వంసం చేశారు. బోర్డు చైర్మన్ జనార్థన్ రెడ్డిని (janardhan reddy) తొలగించాలని డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ అంశంపై సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
పేపర్ లీకేజీ కేసులో 9 మంది నిందితుల కస్టడీ కోరుతూ నాంపల్లి పోలీసులు పిటిషన్ వేశారు. ప్రవీణ్ ఎన్ని పేపర్లు లీక్ చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీనిని షేరింగ్ అండ్ సెల్లింగ్ స్కామ్‌గా భావిస్తోన్న పోలీసులు.. ప్రవీణ్, హెడ్ మాస్టర్ రేణుక కాంటాక్ట్స్‌లో అభ్యర్థుల నంబర్లను గుర్తించారు. సెక్షన్ ఆఫీసర్ శంకర్ లక్ష్మీ ఫోల్డర్లో ఉన్న పేపర్ల గురించి కూడా విచారణ జరుపుతున్నారు.
పేపర్ లీకేజీ అంశం టీఎస్ పీఎస్సీని (tspsc) కుదిపేస్తోంది. ఇప్పటికే టీపీబీవో (tpbo), వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేశారు. ఏఈ (ae) పరీక్ష రద్దుపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. ఈ రోజు మధ్యాహ్నాం 3 గంటలకు కమిషన్ సమావేశం కానుంది. పేపర్ లీక్ చేసిన ప్రవీణ్‌ను (praveen) ఇప్పటికే సస్పెండ్ చేసి.. శాఖపరమైన విచారిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని (rajashekar reddy) విధుల్లోంచి తొలగించాలని డిసిషన్ తీసుకున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (group-1 prelims) పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలు కలుగుతున్నాయి.
గ్రూప్-2 (group-2), గ్రూప్-3 (group-3), గ్రూప్-4 (group-4) నియామకాల కోసం రాత పరీక్ష జరగనుంది. ఇంతలో పేపర్ లీకేజీ కలకలం రేపింది. ఏళ్లుగా చదివి పరీక్ష రాశామని.. ఇప్పుడు పేపర్ లీకేజీతో గందరగోళం నెలకొందని కొందరు అభ్యర్థులు అంటున్నారు. ప్రవీణ్ అండ్ కో చేసిన పని.. తమ పాలిట శాపంగా మారిందని కష్టపడి చదివిన అభ్యర్థులు వాపోతున్నారు.