Group-1 prelims paper కూడా లీక్? ప్రవీణ్‌కు 103 మార్కులు వచ్చినా క్వాలిఫై కాలే
Group-1 prelims paper:పేపర్ లీకేజీ అంశం టీఎస్ పీఎస్సీని (tspsc) కుదిపేస్తోంది. ఇప్పటికే టీపీబీవో (tpbo), వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేశారు. ఏఈ (ae) పరీక్ష రద్దుపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (group-1 prelims) పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలు కలుగుతున్నాయి.
Group-1 prelims paper:పేపర్ లీకేజీ అంశం టీఎస్ పీఎస్సీని (tspsc) కుదిపేస్తోంది. ఇప్పటికే టీపీబీవో (tpbo), వెంటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పరీక్షలను రద్దు చేశారు. ఏఈ (ae) పరీక్ష రద్దుపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. లీకేజీ చేసిన ప్రవీణ్‌ను (praveen) ఇప్పటికే సస్పెండ్ చేసి.. శాఖపరమైన విచారిస్తున్నారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాజశేఖర్ రెడ్డిని (rajashekar reddy) విధుల్లోంచి తొలగించాలని డిసిషన్ తీసుకున్నారు. ఇటీవల జరిగిన గ్రూప్-1 ప్రిలిమ్స్ (group-1 prelims) పేపర్ కూడా లీక్ అయ్యిందనే అనుమానాలు కలుగుతున్నాయి.
ఆ పరీక్షను ప్రవీణ్ (praveen) రాయడంతో సందేహాలు వస్తున్నాయి. 150 మార్కులకు గాను అతనికి 103 మార్కులు వచ్చాయి. అయినప్పటికీ అతను క్వాలిఫై కాలేదు. దీంతో డౌట్ కలుగుతుంది. ప్రవీణ్ (praveen) ఆన్సర్ షీట్‌ను అధికారులు పరిశీలిస్తున్నారు. ఆ పేపర్ ప్రవీణ్ (praveen) లీక్ చేశాడా? లేదా? లీక్ చేస్తే అతనొక్కడే ఉపయోగించాడా? మరెవరికైనా ఇచ్చాడా అనే అంశం తేలాల్సి ఉంది. దీనిపై విచారణ జరిపి.. నిజ నిజాలు తెలియజేస్తామని అధికారులు అంటున్నారు.
ఏఈ పేపర్ లీక్ (paper leak) అవడంతో ప్రవీణ్ సహా 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రవీణ్ (praveen) ఫోన్ పరిశీలించగా.. చాలా మంది మహిళల ఫోటోలు కనిపించాయి. వారితో చాట్ చేసినట్టు గుర్తించారు. కొందరి న్యూడ్ ఫోటోలు కూడా ఉన్నాయి. డిలేట్ చేసిన మెసేజ్ రికవరీ చేసేందుకు నిందితుడి ఫోన్‌ను పోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించారు. ల్యాబ్ రిపోర్ట్ ఆధారంగా గ్రూప్-1 ప్రిలిమ్స్ (group-1 prelims) పేపర్ లీక్ అయ్యింది.. లేనిది తేలిపోనుంది.
గ్రూప్-2 (group-2), గ్రూప్-3 (group-3), గ్రూప్-4 (group-4) నియామకాల కోసం రాత పరీక్ష జరగనుంది. ఇంతలో పేపర్ లీకేజీ కలకలం రేపింది. ఏళ్లుగా చదివి పరీక్ష రాశామని.. ఇప్పుడు పేపర్ లీకేజీతో గందరగోళం నెలకొందని కొందరు అభ్యర్థులు అంటున్నారు. ఏఈ రాత పరీక్షపై కమిషన్ నిర్ణయం తీసుకోనుంది. ప్రవీణ్ అండ్ కో చేసిన పని.. తమ పాలిట శాపంగా మారిందని కష్టపడి చదివిన అభ్యర్థులు వాపోతున్నారు.