AP Cabinet: సాకేత్ మైనేనికి గ్రూప్-1 జాబ్, సమగ్ర కుల గణనకు ఆమోదం
ఏపీ మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. సమగ్ర కుల గణన చేపడతామని.. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి గ్రూప్-1 జాబ్ ఇస్తామని ప్రకటించింది.
Andhra Pradesh Cabinet Decisions: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం (Andhra Pradesh Cabinet) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. 4 గంటలకు పైగా సాగిన సమావేశంలో పలు అంశాలపై చర్చ వచ్చింది. సచివాలయం మొదటి బ్లాక్లో సీఎం జగన్ అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం (Cabinet Meet) జరిగింది.
సమగ్ర కులగణనపై సమావేశంలో చర్చించారు. నవంబర్ 15వ తేదీ నుంచి రాష్ట్రంలో కుల గణన చేపట్టనున్నారు. టెన్నిస్ ప్లేయర్ సాకేత్ మైనేనికి గ్రూప్-1 ఉద్యోగం ఇవ్వాలనే ప్రతిపాదనకు మంత్రివర్గ సమావేశం ఆమోదం తెలిపింది. వీటితోపాటు కీలక నిర్ణయాలను తీసుకుంది.
జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీ చేపడతామని ప్రకటించింది. అర్హుడైన ప్రతీ జర్నలిస్టుకు 3 సెంట్ల స్థలం కేటాయిస్తామని తెలిపింది. ప్రభుత్వ ఉద్యోగుల ఆర్డర్ డ్రాప్ట్-2023కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జగనన్న సురక్ష కార్యక్రమానికి ఆమోదించింది. నవంబర్ 15వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు ఆరోగ్య శ్రీపై అవగాహన కార్యక్రమం చేపడుతామని తెలిపింది.
ఆర్ అండ్ బీలో 467 ఔట్ సోర్సింగ్ పోస్టులను భర్తీ చేస్తామని ప్రకటించింది. 6790 పాఠశాలల్లో భవిష్యత్ నైపుణ్యాలపై బోధిస్తామని పేర్కొంది. ఫెర్రో అల్లాయ్ పరిశ్రమలకు విద్యుత్ ఛార్జీల మినహాయించారు. వ్యవసాయ సహకార శాఖకు రూ.5 వేల కోట్ల గ్యారెంటీతో మార్క్ ఫెడ్ ద్వారా రుణం అందజేస్తారు. పోలవరం నిర్వాసితులకు ఇళ్ల పట్టాల పంపిణీ, స్థలాల రిజిస్ట్రేషన్లకు స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ రుసుం, యూజర్ చార్జీల మినహాయింపు నిర్ణయాన్ని మంత్రివర్గం ఆమోదించింది.